కమ్ముల వల్లే కుబేర లేటవుతోందా?
కుబేర సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దానికి కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములనే అని ఇన్‌సైడ్ టాక్.
By: Tupaki Desk | 1 Feb 2025 3:30 PM GMTటాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న భారీ సినిమాల్లో కుబేర ఒకటి. ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. నాగార్జున పాత్ర గెస్ట్ రోల్ లా కాకుండా ఎక్కువ సేపే ఉంటుందని తెలియడంతో దీన్ని అందరూ మల్టీస్టారర్ మూవీలానే భావిస్తున్నారు.
కుబేర సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. దానికి కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములనే అని ఇన్‌సైడ్ టాక్. ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి శేఖర్ కమ్ముల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, 100% శాటిస్‌ఫై అయితే తప్ప తర్వాతి సీన్ కు వెళ్లడం లేదని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
దీని వల్ల సినిమా షూటింగ్ లేటవుతున్నా ఈ విషయంలో అసలు రాజీ పడేదే లేదని శేఖర్ ఎంతో స్ట్రిక్ట్ గా ఉన్నారని సమాచారం. ఒక సాధారణ బిచ్చగాడు వేల కోట్లు సంపాదించే ధనవంతుడిగా మారితే అతనికి ఎదురయ్యే పరిణామాలేంటనే నేపథ్యంలో కుబేర రూపొందుతుందని టాక్. సినిమాలో నాగార్జున సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం.
కుబేరలో ధనుష్ కి నాగార్జునకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని మొదటి నుంచి అంటున్నారు. 90వ దశకం నేపథ్యంలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ సినిమా కోసం స్పెషల్ సెట్లు వేయాల్సి వచ్చింది. దాని కోసం చిత్ర నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
నా సామిరంగ తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అక్కినేని ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఎక్కువ ఆశలే ఉన్నాయి. కుబేర షూటింగ్ పరిస్థితులు చూస్తుంటే రిలీజ్ ఇప్పట్లో ఉండటం కష్టమనే అనిపిస్తుంది. ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకుంటే ఎంతలేదన్నా ఇప్పటినుంచే మెల్లిగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి.
టీజర్ రిలీజై చాలా రోజులైపోయింది కాబట్టి మళ్లీ కొత్త టీజర్ ను రిలీజ్ చేయాలి. ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేసుకుంటూ ఆ పాటలను ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలి. ధనుష్ హీరో కావడం వల్ల కుబేరకు కోలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి సోలో రిలీజ్ డేట్ ను వెతుక్కోవాలి. ఇన్ని అంశాల మధ్య కుబేర ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.