Begin typing your search above and press return to search.

కుబేర కాంట్రవర్సీ.. మాకు షేర్ ఇవ్వాల్సిందే..!

ఐతే ఈ సినిమా టైటిల్ విషయంలో కాంట్రవర్సీ మొదలైంది. త్రిశక్తి మూవీస్ బ్యానర్ లో నిర్మాత నరేంద్ర కుబేర టైటిల్ రిజిస్టర్ చేసి ఒక సినిమా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 12:43 PM GMT
కుబేర కాంట్రవర్సీ.. మాకు షేర్ ఇవ్వాల్సిందే..!
X

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా టైటిల్ విషయంలో కాంట్రవర్సీ మొదలైంది. త్రిశక్తి మూవీస్ బ్యానర్ లో నిర్మాత నరేంద్ర కుబేర టైటిల్ రిజిస్టర్ చేసి ఒక సినిమా చేస్తున్నారు.

ఐతే శేఖర్ కమ్ముల సినిమాకు కుబేర టైటిల్ పెట్టడంపై నిర్మాతల మండలిని అడిగితే అక్కడ తమకు సరైన సపోర్ట్ దొరకలేదని అన్నారు నిర్మాత నరేంద్ర. అంతేకాదు పెద్ద వాళ్లతో గొడవ ఎందుకని తమనే టైటిల్ మార్చుకోమని అన్నారని వెల్లడించారు. ఇక ఇలా అయితే కుదరదని లీగల్ గా వెల్దామని ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కుబేరకు ముందు శేఖర్ కమ్ముల కుబేర అని వేస్తున్నారని. ధనుష్ కుబేర అని ఒకసారి వేశారని. తమ టైటిల్ వాడుకోవడంలో తమకు అన్యాయం జరుగుతుందని. తమకు న్యాయం జరిగేలా చేయాలని మీడియా ముందు తమ విజ్ఞప్తిని వ్యక్తపరిచారు. ఐతే సినిమా టైటిల్ వాడుకుంటే మాత్రం తమకు షేర్ ఇవ్వాల్సిందే అని అన్నారు. కుబేర టైటిల్ తో తాము ఒక సినిమా చేస్తున్నామని ఐతే అదే టైటిల్ తో మరో సినిమా రిలీజ్ డేట్ కూడా వేయడంతో లీగల్ యాక్షన్ కు దిగుతున్నట్టు వెళ్లడించారు.

మరి ఈ మొత్తం ఎపిసోడ్ పై ధనుష్ కుబేర టీం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. కుబేర సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తారన్నది చూడాలి. స్టార్ హీరోల సినిమాల విషయంలో టైటిల్ కాంట్రవర్సీలు ఇదివరకు చాలా జరిగాయి. ఐతే విషయం పెద్దది కాకుండా చూసుకుంటే బెటర్. ఐతే నిజంగానే చిన్న సినిమా నిర్మాతలు పెట్టిన టైటిల్ ని వారికి ఎలాంటి తర్ఫీదు లేకుండా టైటిల్ ని తీసుకోవాలని అనుకోవడం మాత్రం పొరపాటే అవుతుంది. ఐతే ఇక్కడ ఈ నిర్మాతలు కూడా ఎంత