Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల మాస్ పవర్

ఆనంద్ నుంచి లవ్ స్టోరీ వరకు అతని చేసిన సినిమాలు అన్ని కూడా క్లాస్ టచ్ తోనే కనిపిస్తాయి.

By:  Tupaki Desk   |   9 Sep 2024 2:46 PM GMT
శేఖర్ కమ్ముల మాస్ పవర్
X

టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. ఆయన సినిమాలలో కథల కంటే క్యారెక్టర్స్ జర్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనకి బాగా తెలిసిన కథలనే ఎమోషనల్ డ్రామాతో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో చెప్పడం శేఖర్ కమ్ముల స్టైల్. అందుకే అతని సినిమాలని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఆనంద్ నుంచి లవ్ స్టోరీ వరకు అతని చేసిన సినిమాలు అన్ని కూడా క్లాస్ టచ్ తోనే కనిపిస్తాయి.

అలాగే శేఖర్ కమ్ముల సినిమాలలో స్టోరీలు కథానాయిక చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ హీరోయిన్స్ కి శేఖర్ చిత్రాలలో దొరుకుతాయి. అలాగే లిమిటెడ్ క్యారెక్టర్స్ తోనే అద్భుతమైన డ్రామాతో స్టోరీలు చెప్పి శేఖర్ కమ్ముల ఎక్కువ విజయాలు అందుకున్నారు. ఒక్క అనామిక సినిమా విషయంలోనే అతను ఫెయిల్ అయ్యారు. అయితే అది రీమేక్ మూవీగా తెరకెక్కింది. అనామిక మూవీ కథాంశం బాగున్న తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ఇప్పుడు కుభేర అనే మూవీ చేస్తున్నాడు. ధనుష్, కింగ్ నాగార్జున ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కుభేర మూవీపై అంచనాలు పెంచేసాయి. ధనుష్ ఈ చిత్రంలో ఒక పేదవాడిగా, కింగ్ నాగార్జున ఒక ఆఫీసర్ కనిపిస్తున్నారు. ఈ సినిమాని కమర్షియల్ మాస్ యాక్షన్ జోనర్ లో చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇది వరకు శేఖర్ కమ్ముల సినిమాలలో భీభత్సమైన యాక్షన్ ఘట్టాలు లేవు.

అయితే కుభేర సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయంట. అంతకుమించి పేద, ధనిక ప్రజల మధ్య వ్యత్యాసం. అలాగే ఆశ, అత్యాశల చుట్టూ మనుషుల భావోద్వేగాన్ని మాస్ యాంగిల్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం తనలో ఎవరూ చూడని మాస్ యాంగిల్ ని కుభేర చిత్రంతో శేఖర్ కమ్ముల చూపించబోతున్నాడంట. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. క్లాస్ టచ్ తో పాటు మాస్ బీట్ కూడా కావాలని దేవిశ్రీని శేఖర్ కమ్ముల కుభేర కోసం ఎంపిక చేసుకున్నారంట.

ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. కుభేరలో చేసినటువంటి పాత్రలు ధనుష్ కి కొట్టినపిండి అని చెప్పాలి. అయిన కూడా ఏదో ప్రత్యేకత ఉంటేనే ధనుష్ సినిమా చేయడానికి ముందుకొస్తాడు. కచ్చితంగా శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు చూపించని కొత్త ఎలిమెంట్ ని ఈ సినిమాలో చెప్పబోతున్నాడనే మాట ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.