శేఖర్ కమ్ములానే టెన్షన్ పెట్టిన హీరో అతడు!
ముఖ్యంగా ధనుష్ బిచ్చగాడి పాత్రలుక్ సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది.
By: Tupaki Desk | 21 Jan 2025 4:30 PM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ములా దర్శకత్వంలో 'కుబేర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ మాఫియా స్టోరీ. షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ధనుష్ ,నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు మునుపెన్నడు పోషించని పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ బిచ్చగాడి పాత్రలుక్ సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది.
ఈనేపథ్యంలో అతడి పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా ఈ పాత్ర ధనుష్ కి వివరించడం విషయంలో కమ్ములా ఎంత మదన పడ్డారో రివీల్ చేసారు. 'కుబేర కథ సిద్దమైంది. ధనుష్ కి బిచ్చగాడి పాత్ర గురించి ఎలా చెప్పాలో అర్దం కాలేదు. చెప్పాలా? లేదా? అని ఆలోచనలో పడ్డాను. అసలు నేను ఆయనకు తెలుసో లేదో? అన్న డౌట్ కూడా ఉంది. ధైర్యం చేసి ఆయనకు ఫోన్ చేయగానే ధనుష్ నన్ను ఆశ్చర్యపరిచారు.
నేను తీసిన వాటిలో ఆయన ఫేవరెట్ మూవీలు గురించి చెప్పడం స్టార్ట్ చేసారు. దీంతో నాకు ఆయనపై నమ్మకం కలిగింది. పాత్ర గురించి చెప్పగానే వెంటనే అంగీకరించారు. ధనుష్ తో పనిచేయడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే రష్మిక మందన్న సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఆమెని కలవడానికి ముంబైకి వెళ్లినప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ముంబై టూ హైదరాబాద్ రెస్ట్ లెస్ గా తిరుగుతున్నారు. 'యానిమల్' తో పాటు 'పుష్ప-2' డబ్బింగ్ లో బిజీగా ఉన్నారు.
'కుబేర' సెట్స్ కి వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా ఆమె నీరసంగా లేరు. ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. రష్మిక నిజంగా ఓ మెరుపు. ఇప్పటి వరకూ ధనుష్, రష్మిక కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంటుంద'న్నారు. ప్రస్తుతం కుబేర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రిలీజ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి మూడవ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి.