ఇవేం స్టెప్పులు శేఖర్ మాస్టర్..?
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 4 Jan 2025 8:05 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదల చేసిన ''దబిడి దిబిడి" సాంగ్ యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో ఈ పాటలో స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
'దబిడి దిబిడి' పాటను బాలయ్య, ఊర్వశీ రౌతేలాల మీద చిత్రీకరించారు దర్శకుడు బాబీ. ఇదొక మాస్ డ్యాన్స్ నంబర్. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇంతకముందు ఎప్పుడూ బాలకృష్ణ చేయని మాస్ స్టెప్పులను కంపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ డ్యాన్స్ మీద నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆయన గతంలో కొరియోగ్రఫీ చేసిన 'మా మా మహేష్', 'భూమ్ బద్దల్' పాటల్లోని డ్యాన్స్ మూవ్స్ ను రిపీట్ చేశాడని ట్రోల్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ సెల్యులాయిడ్ అంటూ అన్ని పాటలను మిక్స్ చేసి పోస్టులు పెడుతున్నారు.
ముఖ్యంగా 'దబిడి దిబిడి' పాటలో ఊర్వశి బ్యాక్ మీద బాలయ్య చేతులతో దరువు వేయడం, నాభి కింద చేయి పెట్టి డ్రెస్ లాగడం వంటి స్టెప్పుల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే నటించిన పాటకు అలాంటి కొరియోగ్రఫీ చేయడం ఏంటని శేఖర్ ను విమర్శిస్తున్నారు. మాస్ స్టెప్పుల పేరుతో వల్గారిటీ కనిపించేలా డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి 'మిస్టర్ బచ్చన్' సినిమాలో సితార్ పాటకు, 'పుష్ప 2'లో పీలింగ్స్ సాంగ్ కు కూడా శేఖర్ ఇలాంటి స్టెప్పులనే కొరియోగ్రఫీ చేసాడు. హీరోయిన్ బొడ్డు కింద చెయ్యి పెట్టి చీర లేదా డ్రెస్సును లాగే స్టెప్పును హీరోలతో వేయించాడు. ఇప్పుడు 'దబిడి దిబిడి' పాటలోనూ సేమ్ డ్యాన్స్ మూమెంట్స్ పెట్టాడు. సితార్ సాంగ్ లో మాదిరిగా హీరోయిన్ నడుము మీద తబలా వాయించే స్టెప్పును కూడా రిపీట్ చేసాడు. ఇవే ఇప్పుడు ట్రోల్ చెయ్యడానికి నెటిజన్లకు అవకాశం కల్పించాయి.
శేఖర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరుగా రాణిస్తున్నారు. మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ తో 'గుంటూరు కారం' సినిమాలో మాస్ స్టెప్పులు వేయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ చిత్రాల్లో డ్యాన్స్ మూవ్స్ విషయంలో విమర్శలు ఎదుర్కున్నాడు. ఇవి మరీ టూమచ్ ఉన్నాయని, వల్గర్ ఫీలింగ్ కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి నుంచైనా శేఖర్ మాస్టర్ డ్యాన్స్ లలో వైవిధ్యం చూపించాలని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని స్టెప్పులు డిజైన్ చేయాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే 'డాకు మహారాజ్' సినిమాలోని 'దబిడి దిబిడి' పాటపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఫైర్ అయ్యాడు. పనిలో పనిగా టాలీవుడ్ పై విమర్శలు చేశాడు. "ఇలాంటి అసభ్యకరమైన పాటలను చిత్రీకరించడానికి తెలుగు సినీ పరిశ్రమకు సిగ్గు లేదా? దీని బదులుగా పోర్న్ సినిమాలు తీయడం మంచిది. ఊర్వశి రౌతేలా కూడా ఇలాంటి పాట చేసినందుకు సిగ్గుపడాలి" అని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.