Begin typing your search above and press return to search.

రాక్‌స్టార్‌ తో కమ్ముల 'ఫిదా'...!

శేఖర్‌ కమ్ముల పేరు చెప్పగానే ఆయన మార్క్ క్లాస్ సినిమాలు గుర్తుకు వస్తాయి

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:30 PM GMT
రాక్‌స్టార్‌ తో కమ్ముల ఫిదా...!
X

శేఖర్‌ కమ్ముల పేరు చెప్పగానే ఆయన మార్క్ క్లాస్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆనంద్, గోదావది మొదలుకుని ఫిదా మరియు లవ్‌ స్టోరీ సినిమాలు కూడా చాలా క్లాస్ గా కమర్షియల్‌ టచ్‌ తో ఉంటాయి అనడంలో సందేహం లేదు. అలాంటి శేఖర్‌ కమ్ముల ఈసారి మాస్ టచ్ మూవీ చేయబోతున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది.

లవ్‌ స్టోరీ విడుదల అయిన వెంటనే ధనుష్ హీరోగా శేఖర్‌ కమ్ముల సినిమాను ప్రకటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ధనుష్ నుంచి శేఖర్‌ కమ్ములకు గ్రీన్ సిగ్నల్‌ లభించింది. త్వరలోనే పట్టాలెక్కే విధంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది.

ఒక వైపు నటీ నటుల ఎంపిక మరియు సెట్స్ నిర్మాణం చేస్తూ మరో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్‌ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాకి గాను శేఖర్‌ కమ్ముల రాక్ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తో కలిసి వర్క్‌ చేయబోతున్నాడు. ధనుష్, శేఖర్‌ కమ్ముల మూవీ కోసం దేవి శ్రీ ప్రసాద్‌ మాస్ బీట్స్ రెడీ చేస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

దేవిశ్రీ ప్రసాద్‌ కి సంగీత బాధ్యతలు అప్పగించడం వల్ల ఈ సినిమా కచ్చితంగా మాస్ యాంగిల్‌ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది అనుకుంటున్నారు. అంటే శేఖర్‌ కమ్ముల ఈసారి ధనుష్ తో ఓ భారీ మాస్ మసాలా సినిమా ను చేయబోతున్నాడు అన్నమాట.

ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని కూడా మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా త్వరలో స్పష్టత వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. శేఖర్‌ కమ్ముల వంటి ఫీల్ గుడ్‌ చిత్రాల దర్శకుడు మాస్‌ సినిమాను తీస్తే, అందులో మాస్ సాంగ్స్ ఉంటే ఎలా ఉంటుందో చూడాలి. 2024 లో ఈ అరుదైన కలయిక మూవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.