Begin typing your search above and press return to search.

పుష్ప 2... సెల్వ రాఘవన్‌ బోనస్ కామెంట్స్‌!

తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ స్పందించాడు. సూసేకి పాట చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్‌ గా ఉందని పేర్కొన్నాడు.

By:  Tupaki   |   30 May 2024 10:27 AM GMT
పుష్ప 2... సెల్వ రాఘవన్‌ బోనస్ కామెంట్స్‌!
X

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నుంచి ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా రెండో పాట సూసేకి అగ్గి రవ్వ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నల డ్యూయెట్‌ గా సాగే ఈ పాటకు మంచి మార్కులు పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్‌ మరోసారి నా సామి తరహా పాట ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇప్పటికే యూత్‌ లో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ స్పందించాడు. సూసేకి పాట చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్‌ గా ఉందని పేర్కొన్నాడు. పుష్ప 2 సత్తా ఏమిటో తెలియాలంటే ఈ ఒక్క పాట చాలు... మిగిలినది అంతా కూడా బోనస్‌ అంటూ కామెంట్ చేశాడు.

సెల్వ రాఘవన్ వంటి స్టార్‌ దర్శకుడు పుష్ప 2 పాట పై చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి. సెల్వ ట్వీట్‌ కి అల్లు అర్జున్‌ స్పందించారు. థ్యాంక్యూ సెల్వ గారు, సో స్వీట్‌ ఆఫ్‌ యు అంటూ రిప్లై ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు అంతా వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 1 వచ్చి రెండేళ్లు అయినా కూడా ఇంకా ఆ ఎఫెక్ట్‌ ఉంది. కనుక పుష్ప 2 సినిమా అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బన్నీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.