ప్లాప్ వచ్చినా అప్పట్లో ఓ ఛాన్స్..కానీ ఇప్పుడలా కాదు!
తాజాగా ఈ కాన్సెప్ట్ పై శ్రీనువైట్ల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'అప్పటితో పోల్చితే ఇప్పుడు సినిమా మేకింగ్ అన్నది చాలా సులభంగా మారింది.
By: Tupaki Desk | 4 Dec 2024 8:30 AM GMTఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్లు అంతా ఒక్కొక్కరుగా బలహీనపడుతోన్న సంగతి తెలిసిందే. కొత్త తరం దర్శకులు సరికొత్త కాన్సెప్ట్ లతో రావడంతో ఇండస్ట్రీ ట్రెండ్ కూడా మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టు న్యూ ఏజ్ కాన్సెప్ట్ లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయడం బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పలువురు సీనియర్ దర్శకులు ఇండస్ట్రీలో ఉన్నా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఈ కాన్సెప్ట్ పై శ్రీనువైట్ల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'అప్పటితో పోల్చితే ఇప్పుడు సినిమా మేకింగ్ అన్నది చాలా సులభంగా మారింది. బోలెడంత సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పట్లో ఓప్లాప్ ఎదురైనా మళ్లీ నిలదొక్కుకోవడానికి కొంత సమయం దొరికేది. కానీ ఇప్పుడు పోటీ ఎక్కువైంది. అందువల్ల అప్పు డనన్ని అవకాశాలు ఇప్పటి దర్శకులు అందుకోలేకపోవచ్చు. బడ్జెట్లు ఎక్కువ య్యాయి. అందువల్ల ప్రతీ సినిమాకి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది.
నేను నమ్మేది ఒక్కటే. అన్ని క్రాప్ట్ లకు ప్రధానమైన క్రాప్ట్ స్క్రిప్ట్. దాన్ని బలంగా చేసుకుంటే అవకాశాలు వాటంత టవే వస్తాయి. ప్రస్తుతం కొత్త తరహా కథలు మాత్రమే కొత్త అవకాశాలు సృష్టించగలవని నేను బలంగా నమ్ముతు న్నాను' అని అన్నారు. ఇటీవలే శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన 'విశ్వం' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ హీరోగా నటించిన సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైన వాటిని అందుకోవడంలో ఆశించిన ఫలితం సాధించలేదు. సీనియర్ దర్శకుల్లో వి.వినాయక్ ఇప్పటికే దర్శకుడిగా సినిమాలు చేయని సంగతి తెలిసిందే.