Begin typing your search above and press return to search.

నూత‌న ప్ర‌తిభ‌కే ఇండ‌స్ట్రీ ప‌ట్టాభిషేకం!

ఇండ‌స్ట్రీ స‌హా హీరోలంతా ఇప్పుడు సీనియారిటీ కంటే కొత్త త‌రం ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల వైపే ఆస‌క్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 5:30 PM GMT
నూత‌న ప్ర‌తిభ‌కే ఇండ‌స్ట్రీ ప‌ట్టాభిషేకం!
X

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల‌ పై అవుట్ డేటెడ్ ముద్ర ప‌డిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత మంది సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు కామ్ అయిపోయారు. పూరి జ‌గ‌న్నాధ్, శ్రీను వైట్ల లాంటి వారు ఇంకా త‌మ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఫాంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. సినిమా ట్రెండ్ మారిన నేప‌థ్యంలో వాళ్లు కూడా అప్ డేట్ అవ్వాల్సిందే. లేకుంటే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టికే అవ‌కాశాలు కూడా త‌గ్గాయి.

ఇండ‌స్ట్రీ స‌హా హీరోలంతా ఇప్పుడు సీనియారిటీ కంటే? కొత్త త‌రం ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల వైపే ఆస‌క్తి చూపిస్తున్నారు. వాళ్ల‌తోనే సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నారు. నాగ్ అశ్విన్, ప్ర‌శాంత్ నీల్, సుకుమార్, చందు మొండేటి, రిష‌బ్ శెట్టి, సందీప్ రెడ్డి వంగా లాంటి పాన్ ఇండియా ప్ర‌తిభావంతుల‌తోనే ప‌ని చేయ‌డానికి స్టార్ హీరోలంతా ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ డైరెక్ట‌ర్లు అంతా కూడా ఇండ‌స్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు.

ఇంకా త‌ర్వాత త‌రం మేక‌ర్స్ అయిన శైలేష్ కొల‌ను, `క` ఫేం సుజీత్-సందీప్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హ‌ను రాఘ‌వ‌పూడి, వెంకీ అట్లూరీ, వెంకీ కుడుముల‌, శ్రీకాంత్ ఓదెల‌, అనుదీప్, బ‌లగం వేణు, విమ‌ల్ కృష్ణ‌, మ‌ల్లిక్ రామ్, రాహుల్ సంకృత్య‌న్ , వ‌శిష్ట‌, కార్తీక్ వ‌ర్మ దండు, లాంటి యంగ్ డైరెక్ట‌ర్లు మంచి ఫాంలో ఉన్నారు. టైర్ -2 హీరోలంతా యంగ్ మేక‌ర్స్ తో ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు.

చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోలు కూడా సీనియ‌ర్ కంటే జూనియ‌ర్ డైరెక్ట‌ర్లే బెట‌ర్ అనే ఆప్ష‌న్ చూజ్ చేసుకుంటున్నారు. క‌థ‌ల్లో కొత్త‌ద‌నం, వాటి స‌క్సెస్ రేట్, మేకింగ్ విధానం వంటి వాటిని ప‌రిగణ‌లోకి తీసుకుని పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు.