Begin typing your search above and press return to search.

రెమ్యునరేషన్స్ తో భయపెడుతున్న సీనియర్ బ్యూటీలు

సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ రెండు దశాబ్దాల కెరియర్ పూర్తి చేసుకుంది అంటే ఇక ఆమె కెరియర్ ముగింపుకి వచ్చినట్లే

By:  Tupaki Desk   |   17 Nov 2023 3:58 AM GMT
రెమ్యునరేషన్స్ తో భయపెడుతున్న సీనియర్ బ్యూటీలు
X

సౌత్ ఇండియాలో ఒక హీరోయిన్ రెండు దశాబ్దాల కెరియర్ పూర్తి చేసుకుంది అంటే ఇక ఆమె కెరియర్ ముగింపుకి వచ్చినట్లే. పదేళ్ళు పూర్తి చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయాయి. కెరియర్ ఎండింగ్ లో స్టార్ హీరోలకి జోడీగా అవకాశాలు రాకపోవడంతో సీనియర్ హీరోల పక్కన లేదంటే ఫిమేల్ సెంట్రిక్ కథలు చేసుకుంటున్నారు. ఈ లిస్టులో ఇప్పుడు చాలా మంది భామలు ఉన్నారు.


అయితే స్టార్ హీరోయిన్స్ అయిన త్రిష, నయనతార మాత్రం ఇప్పటికి తన కెరియర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. నయనతార అయితే కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అయిపొయింది. ఈ ఏడాది ఏకంగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత త్రిష ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఈ ఏడాది లియో సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. అజిత్ మూవీలో ప్రస్తుతం నటిస్తోంది. అలాగే మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. వీటితో పాటు ఫిమేల్ సెంట్రిక్ కథలతో కూడా సత్తా చాటుతోంది. ఇలా వరుస సినిమాలు ఉండటంతో ఈ బ్యూటీలు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఒక్కో మూవీకి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట.

టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సీనియర్ హీరోలకి జోడీగా త్రిష, నయనతారని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు అడుగుతున్నా రెమ్యునరేషన్ విని షాక్ అవుతున్నారు. అంత బడ్జెట్ తట్టుకోలేమని చేతులెత్తేస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో రూపాయి కూడా తగ్గేది లేదు అని ఇద్దరు భామలు అంటూ ఉండటంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కి వెళ్ళిపోతున్నారు.

కోలీవుడ్ నుంచి ఈ ఇద్దరు బ్యూటీస్ కి ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో తమకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. అలాగే తమ సినిమా ఏదైనా తెలుగులో డబ్ అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలుగు దర్శక నిర్మాతలకి రెమ్యునరేషన్ లతో షాక్ ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఎంత పెద్ద హీరోయిన్ అయిన 5 కోట్లకి మించి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇష్టపడరు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మాత్రం కాస్తా ఆలోచిస్తారు. కాని స్క్రిప్ట్ డిమాండ్ చేసే పాత్రలు హీరోయిన్స్ కి తెలుగులో లభించేది చాలా తక్కువ అని చెప్పాలి.