సీనియర్లు ఇక ట్రెండ్ మార్చాల్సిందే!
'బాహుబలి'.. 'పుష్ప'.. 'కార్తికేయ-2' .. 'అర్జున్ రెడ్డి'..'యానిమల్' లాంటి సినిమాల వసూళ్లే అందుకు సజీవ సాక్ష్యాలు
By: Tupaki Desk | 17 Dec 2023 3:30 PM GMTతెలుగు సినిమా పాన్ ఇండియాని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి..సుకుమార్...చందు మొండేటి .. సందీప్ రెడ్డి వంగ లాంటి క్రియేటర్స్ పాన్ ఇండియాలో సంచలనాలు నమోదు చేస్తున్నారు. 100 కోట్ల కే పరిమితమైన తెలుగు సినిమా స్థాయిని మార్చిన దర్శకులు వాళ్లంతా. వీళ్లందరిలో ఎవరి ప్రత్యేకత? వారికుంది. వాళ్లకంటూ పాన్ ఇండియాలో ఓ బ్రాండె ఐడెంటిటీని చాటుకున్నారు.
'బాహుబలి'.. 'పుష్ప'.. 'కార్తికేయ-2' .. 'అర్జున్ రెడ్డి'..'యానిమల్' లాంటి సినిమాల వసూళ్లే అందుకు సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ న్యూ జానర్ సినిమాలు. పాన్ ఇండియాకి కనెక్ట్ అయిన కంటెంట్ లు ఉన్నవి. ఇకపై వీళ్ల నుంచి రిలీజ్ అయ్యే ప్రతీ సినిమా? అలాగే ఉంటుంది. వాళ్ల ప్లానింగ్ స్పాన్ సైతం అంకంతకు విస్తరి స్తుంది. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ ని షేక్ చేయడం ఎలా ? అన్న ఆలోచన వాళ్లలో ఇప్పటికే మొదలైంది.
దీంతో సీనియర్లు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందా? అంటే అవుననే చెప్పాలి. ఇంకా టాలీవుడ్ కే పరిమితయ్యే సినిమాలే చేస్తామంటే? కుదరదు. సీనియర్ల స్టోరీలు మారాలి. మేకింగ్ సరళిలోనూ మార్పులు రావాలి. పాత కంటెంట్ నే పట్టుకుని ఇంకా సినిమాలు చేస్తామంటే కుదరదు. క్రియేటివ్ పరంగా ఫరిది దాటాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే కొంతమంది దర్శకుల్లో ఛెంజెస్ కనిపిస్తున్నాయి. శేఖర్ కమ్ము లా కూడా ధనుష్ సినిమాతో కొత్త జానర్ లో కి అడుగు పెడుతున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు.
కొరటాల శివ..నాగ్ అశ్విన్ లాంటి వారు పాన్ ఇండియాలో వాళ్లు చేస్తున్న ప్రాజెక్ట్ ల్ని బట్టి ఈ మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకా పూరిజగన్నాధ్...త్రివిక్రమ్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలతో ముందుకు రావాలి. ఇంతవరకూ వాళ్లిద్దరు తెలుగు ఆడియన్స్ ని దృష్టి పెట్టుకునే సినిమాలు చేసారు.