సీనియర్లు అంతా నో రిబేట్ పాలసీ!
ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం కొదవలేదు. రోజుకో భామ దిగుమతి అవుతుంది. సక్సెస్ అయిన వారంతా రేసులో దూసుకుపోతుంటారు.
By: Tupaki Desk | 10 Nov 2023 11:30 PM GMTఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం కొదవలేదు. రోజుకో భామ దిగుమతి అవుతుంది. సక్సెస్ అయిన వారంతా రేసులో దూసుకుపోతుంటారు. కానీ వారంతా మరో ఆప్షన్ తో ముందుకెళ్తుంటారు. ఏదో రకంగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఏటూ కాని వారు ఎలా వచ్చారా? అలిగే టిటర్న్ టికెట్ వేసుకుం టారు. కానీ మేము మాత్రం లోకల్ అంటూ కొందరు సీనియర్ భామలు భామలు మాత్రం పారితోషికం పరంగా ఏమాత్రం తగ్గలేదు.
డిమాండ్ ఉన్నా? లేకపోయినా డిమాండ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నలుగురైదుగురు సీనియర్ భామలు కనిపిస్తున్నారు. అనుష్క శెట్టి ఇటీవలే `మిసెస్ శెటి మిస్టర్ పోలిశెట్టి`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా. ఈసినిమాకి ముందు ఆమె సినిమాలు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకంత వేగంగా టాలీవుడ్ లో మూవ్ కాలేదు? అన్న సంగతి తెలియదు గానీ అమ్మడు మాత్రం మార్కెట్ డిమాండ్ తగ్గలేదని వినిపిస్తుంది.
తాను ఇప్పుడే సినిమా కమిట్ అయిన పారితోషికం పాత లెక్కల ప్రకారమే అందుకుంటుంది. `మిసెస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి`కి ఐదు కోట్లకు పైగానే అందుకుందని సమాచారం. అలాగే మాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతుంది. అక్కడ మాత్రం డెబ్యూ కావడంతో కాస్త తగ్గినట్లు సమాచారం. తెలుగులో కొత్తగా ఏ సినిమా చేయాలన్నా? నా లెక్క నాకుందంటోందిట. అలాగే అమెరికాలో ఉన్న సమంత బాలీవుడ్ లో బిజీ అయ్యే క్రమంలో టాలీవుడ్ ని లైట్ తీసుకుంది.
కానీ పారితోషికం రెట్టింపు ఇస్తే నో అనే ఛాన్స్ లేదని వినిపిస్తుంది. ఇక్కడ సినిమాలు చేసినా? చేయక పోయినా సామ్ మాత్రం మూడు కోట్లకు పైగానే ఛార్జ్ చేసేలా ఫిక్స్ అయిందిట. అలాగే రష్మిక మందన్న.. పూజాహెగ్డే కూడా 3 కోట్లకు తగ్గలేదు. కొత్త కమిట్ మెంట్ ఏదైనా తన రెమ్యునరేషన్ కమిట్ మెంట్ 3 స్టార్ అంటున్నారు. ఇక శృతిహాసన్ కూడా రెండు కోట్లకు తగ్గనంటోందిట. అమ్మడి కెరీర్ తెలుగులో స్లోగా ఉన్నా! డిమాండ్ విషయంలో మాత్రం తగ్గలేదని వినిపిస్తుంది.
అలాగే చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా `భగవంత్ కేసరి` తో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకూ రిబేట్ ఇస్తుందని కొంత మంది నిర్మాతలు ఆశించినా తాజా సక్సెస్ తో అది జరిగే పని కాదని తేలిపోయింది. లేడీ ఓరియేంటెడ్ అవకాశాలతో పాటు.. సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ కావడంతో కాజల్ వేగాన్ని అపడం కష్టమైన పనే.