Begin typing your search above and press return to search.

పొంగల్ కి సీనియర్ల ఫైట్ తప్పదా..?

సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే లెక్క.

By:  Tupaki Desk   |   24 July 2024 4:24 AM GMT
పొంగల్ కి సీనియర్ల ఫైట్ తప్పదా..?
X

సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే లెక్క. కొత్త సంవత్సరం వచ్చే మొదటి పండగగా సంక్రాంతికి చాలా విశిష్టత ఉంటుంది. అందుకే సంక్రాంతికి స్టార్స్ కూడా తమ సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటారు. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్య ఆ హీరోల ఫ్యాన్స్ మధ్య ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. పొంగల్ లో గెలుపు కోసం ప్రతి స్టార్ తమ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటారు. ఐతే ఎప్పటిలానే 2025 సంక్రాంతి కి కూడా స్టార్ సినిమాలు లైన్ కట్టాయి.

ఈసారి సంక్రాంతికి వస్తున్నాను అంటూ ముందే ప్రకటించాడు మెగాస్టార్. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న చిరు సినిమా రిలీజ్ డేట్ ని ముందే లాక్ చేశారు. మరీ సంక్రాంతి పండగ టైం అంటే కష్టమని జనవరి 10కే విశ్వంభర రిలీజ్ పెట్టుకున్నారు. ఇక చూస్తుంటే NBK 109 కూడా సంక్రాంతికే వచ్చేలా ఉన్నాడు. బాలకృష్ణ, కె ఎస్ బాబీ కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేయలేదు. మేకర్స్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటుండగా ఆల్రెడీ డిసెంబర్ కి స్లాట్స్ బుక్ అయ్యాయి.

ఈసారి డిసెంబర్ లోనే సంక్రాంతి శోభ కనిపించేలా ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ వరకు సినిమాల హంగామా ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వనుంది. ఐతే బాలకృష్ణ బాబీ సినిమా కూడా సంక్రాంతి రేసులో దిగే ఛాన్స్ కనిపిస్తుండగా విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికే తన సినిమా ఫిక్స్ అనేట్టు ఉన్నాడు. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వెంకటేష్ చేస్తున్న సినిమాకు ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. మరి టైటిల్ పెట్టేదే సంక్రాంతికి వద్దామని కాబట్టి ఆ సినిమా కూడా పొంగల్ ఫైట్ కి రానుందని చెప్పొచ్చు.

అనూహ్యంగా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఈ ముగ్గురు వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ లో నిలుస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఇలా ఫైట్ చేయడం ఇదే మొదటిసారి కాదు ఇదివరకు ఒకటి రెండు సార్లు వీరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఐతే 2025 సంక్రాంతికే ప్రభాస్ రాజా సాబ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెబల్ స్టార్ సినిమా వస్తే మాత్రం సీనియర్ హీరోల సినిమా మీద కాస్త ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.