Begin typing your search above and press return to search.

సీరియల్స్ తోనే ఎక్కువ సంపాదించిన సీనియర్ హీరోయిన్

అందుకే సుదీర్ఘకాలం సౌత్ ఇండస్ట్రీని హీరోయిన్ గా రాధిక రూల్ చేసింది.

By:  Tupaki Desk   |   29 March 2024 4:51 AM GMT
సీరియల్స్ తోనే ఎక్కువ సంపాదించిన సీనియర్ హీరోయిన్
X

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్స్ లలో రాధిక ఒకరు. రాధ, రాధిక, విజయశాంతి లతో మెగాస్టార్ ఎక్కువ సినిమాలు చేశారు. ఎలాంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉన్న నటిగా ఆమెకి మంచి ఇమేజ్ ఉంది. మోడ్రన్ క్యారెక్టర్ అయిన, పల్లెటూరి అమ్మాయి పాత్రలో అయిన, గయ్యాళిగా అయిన అమాయకురాలిగా అయిన ఆమె నటన విశ్వరూపం చూపిస్తుంది.


అందుకే సుదీర్ఘకాలం సౌత్ ఇండస్ట్రీని హీరోయిన్ గా రాధిక రూల్ చేసింది. తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆమె ప్రయాణం సాగిస్తోంది. మరో వైపు రాడాన్ మీడియా వర్క్స్ పేరుతో నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి సీరియల్స్ కూడా రాధిక చేసింది. సీరియల్స్ తో ఆమె ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

రాధిక భర్త శరత్ కుమార్ చాలా కాలంగా తమిళనాడు రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. భర్త మార్గంలోనే రాధిక శరత్ కుమార్ కూడా ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా బరిలో ఉన్నారు. ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఆమె ఆస్తుల వివరాలు తెలియజేశారు.

రాధిక శరత్ కుమార్ కి సొంతంగా 53.45 కోట్ల ఆస్తి ఉందంట. అందులో నగదు 33.01 లక్షలు, ఆభరణాలు: 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయంట. చరాస్తి రూపంలో 27.05 కోట్లు, స్థిరాస్తి 26.40 కోట్లు ఆమె పేరు మీద ఉన్నాయంట. అలాగే 14 కోట్ల వరకు అప్పులు కూడా రాధిక శరత్ కుమార్ కి ఉన్నాయంట. ఇదంతా అఫీషియల్ గా రికార్డ్స్ లెక్కల్లో ఉన్న ఆస్తి అని తెలుస్తోంది.

హీరోయిన్ గా, నిర్మాతగా ఇన్నేళ్ల కాలంగా ఆమె పెద్దగా ఆస్తులు సంపాదించలేదని దీనిని బట్టి తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం కొనసాగిన ఆస్తులు కూడబెట్టలేదు. కేవలం నిర్మాతగానే సీరియల్స్ ద్వారా సొంత ఆస్తులు సంపాదించింది. ఇక ప్రస్తుతం సీరియల్స్ కూడా ఆమె పెద్దగా నిర్మించడం లేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లోనే ప్రత్యేకమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఆ మధ్య ఒక వెబ్ సీరీస్ ను నిర్మించాలని అనుకున్నప్పటికి మళ్ళీ మధ్యలో ఆపేశారు. వెబ్ సీరీస్ లు చేయాలని ఉందని చాలాసార్లు చెప్పిన ఆమె తప్పకుండా భవిష్యత్తులో ఒక డిఫరెంట్ ఓటీటీ కంటెంట్ తో మెప్పిస్తానని అన్నారు.