Begin typing your search above and press return to search.

వయనాడ్ కోసం సీనియర్ హీరోయిన్స్...!

సీనియర్‌ హీరోయిన్స్ అయిన మీనా, కుష్బూ, సుహాసిని, శ్రీప్రియ, కళ్యాణి ప్రియదర్శన్‌, లస్సీ లక్ష్మి, శోభన లు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కోటి రూపాయల సహాయం వయనాడ్ బాధితులకు అందజేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 10:54 AM GMT
వయనాడ్ కోసం సీనియర్ హీరోయిన్స్...!
X

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు విరిగి పడి వందలాది మంది మృతి చెందడటంతో పాటు వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయిన విషయం తెల్సిందే. ఎక్కడ ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు ముందు ఉండి తమకు తోచిన సాయం ను చేస్తూ ముందు నుంచి కూడా బాసటగా నిలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వయనాడ్‌ బాధితుల కోసం కూడా ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పటికే కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం గా ఇవ్వడం జరిగింది. ప్రభాస్‌ రెండు కోట్ల భారీ విరాళంను ఇవ్వడం తెల్సిందే. ఇంకా అల్లు అర్జున్‌ తో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా తమకు తోచిన సాయం అందించడం ద్వారా మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు వయనాడ్‌ కోసం సీనియర్ హీరోయిన్స్ ముందుకు వచ్చారు. ఏకంగా కోటి రూపాయలను జమ చేసి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కి అందజేయడం ద్వారా తమ మంచి మనసును చాటుకున్నారు.

సీనియర్‌ హీరోయిన్స్ అయిన మీనా, కుష్బూ, సుహాసిని, శ్రీప్రియ, కళ్యాణి ప్రియదర్శన్‌, లస్సీ లక్ష్మి, శోభన లు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కోటి రూపాయల సహాయం వయనాడ్ బాధితులకు అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని మీనా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. సీనియర్‌ హీరోయిన్స్ చేసిన ఈ ఆర్థిక సహాయంను పలువురు అభినందిస్తున్నారు. స్టార్‌ హీరోలు ఎంతో మంది ఉన్నా కూడా ఇప్పటి వరకు కొందరు హీరోలు కనీసం స్పందించలేదు. కానీ సీనియర్ హీరోయిన్స్ మాత్రం కోటి సాయం అందించడం ద్వారా సామాజిక బాధ్యతను ప్రదర్శించారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వయనాడ్‌ జిల్లా జల ప్రళయంలో మృతి చెందిన మరియు నిరాశ్రయులుగా మిగిలిన వారికి తాము చేస్తున్న సహాయం చిన్నదే అయినా వారికి ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటుగా నిలుస్తుందని భావిస్తున్నాం. ఈ సమయంలో వారికి ప్రతి ఒక్కరి నుంచి ఏదో విధంగా మద్దతు అవసరం. ప్రభుత్వం సకాలంలో వారికి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామం. ముందు ముందు కూడా వారి కోసం ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సీనియర్‌ హీరోయిన్స్ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేశారు.