చిరు-నాగ్..వెంకీ..బాలయ్య మళ్లీ కలిసేదెప్పుడు?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ లు కొత్తేం కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం లోనే మల్టీస్టారర్ చిత్రాలున్నాయి
By: Tupaki Desk | 10 March 2024 1:30 AM GMTటాలీవుడ్ లో మల్టీస్టారర్ లు కొత్తేం కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం లోనే మల్టీస్టారర్ చిత్రాలున్నాయి. ఆ తర్వాత తరం నటులు కొనసాగించారు. అయితే కాలక్రమంలో ఆ ట్రెండ్ కనుమరుగైంది. మళ్లీ కొన్నాళ్లకి వెంకటేష్-మహేష్ లు ఆ పద్దతిని ఆచరణలోకి తేవడంతో అమలులోకి వచ్చింది. ఇప్పడు హీరోలంతా కలిసి ఒకే ప్రేమ్ లో కనిపించడానికి సిద్దంగా ఉన్నారు. ఇతర భాషల నటులు సైతం తెలుగు హీరోలతో కలిసి నటిస్తున్నారు.
మరి చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-కలిసి నటించేది ఎప్పుడు అంటూ ఓ డౌట్ రావడం సహజమే. ఎందుకంటే ఈ నలుగురు కలిసి నటించారు అన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. దశాబ్ధాల క్రితం తెరకెక్కిన `త్రిమూర్తులు` అనే చిత్రంలో ఓపాటలో భాగంగా ఏకంగా అందులో 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతిరావు దర్శనమిచ్చారు. చిరంజీవి-బాలయ్య-వెంకటేష్-నాగార్జున తెరను పంచుకోవడం అదే తొలిసారి.
ఆ తర్వాత మళ్లీవాళ్లు కలిసి నటించింది లేదు. తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఆ నలుగురు కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంది? అన్న ఆలోచన అభిమానుల్లో మొదలైంది. నాటి త్రిమూర్తులు గుర్తుకు రావడంతో ఈనలుగురు పూర్తి స్థాయిలో ఓ సినిమా చేస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వదా? అని అంటున్నారు. ఐడియా మంచిదే. ఆ నలుగురు హీరోల్ని ఒకే తెరపై చూడాలని అభిమా నులు చాలా ఆశగానే ఉన్నారు.
ఆ హీరోలు సైతం కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదు. నలుగురు హీరోల ఇమేజ్ కి తగ్గ స్టోరీ కుదడరమే ఆలస్యం. రంగంలోకి దిగడానికి పెద్దగా సమయం పట్టదు. ఆ నలుగురు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఒకేతరం హీరోలు కూడా. నాగార్జున-వెంకటేష్ ఇప్పటికే నేటి జనరేషన్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి-బాలయ్య కూడా వాళ్ల సినిమాల్లో కీలక పాత్రల్లో స్టార్ హీరోల్ని ఉండేలా చూసుకుంటున్నారు. కాబట్టి ఛాన్స్ వస్తే మిస్ చేసుకునే అవకాశం ఉండదు.