Begin typing your search above and press return to search.

సీక్వెళ్లు ఢీ అంటే ఢీ.. పైచేయి ఎవ‌రిది?

'సింగమ్ ఎగైన్‌'లో బాలీవుడ్ అగ్ర‌ తారల గేలాక్సీ న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 2:30 AM GMT
సీక్వెళ్లు ఢీ అంటే ఢీ.. పైచేయి ఎవ‌రిది?
X

ఈ ఏడాది బాలీవుడ్ లో దీపావళి విడుదల‌ల మ‌ధ్య హోరాహోరీ నెల‌కొంది. అజ‌య్ దేవ‌గ‌న్ -సింగం ఎగైన్ తో కార్తీక్ ఆర్య‌న్ `భూల్ భూలయ్యా 3` పోటీకి దిగుతోంది. ఈ రెండిటి న‌డుమా ఉత్కంఠభరితమైన ఘర్షణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ రెండు సీక్వెల్ చిత్రాల‌కు బ‌ల‌మైన బ‌జ్ ఉంది. `సింగమ్ ఎగైన్‌`లో బాలీవుడ్ అగ్ర‌ తారల గేలాక్సీ న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. వారిలో ఎక్కువ మంది సూపర్‌కాప్‌లు గా క‌నిపిస్తారు. అక్ష‌య్ కుమార్, ర‌ణ్ వీర్ సింగ్, టైగ‌ర్ ష్రాఫ్, విక్కీ కౌశ‌ల్, దీపిక ప‌దుకొనే లాంటి స్టార్లు పోలీసాఫీస‌ర్లుగా మెరుపులు మెరిపించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలోకి మ‌రో సూప‌ర్ కాప్ చుల్బుల్ పాండే ఎంట‌ర్ అయ్యాడ‌నేది తాజా వార్త‌. మ‌రోవైపు కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన భూల్ భుల‌యా 2 పెద్ద విజ‌యం సాధించ‌గా, ఇప్పుడు మూడో భాగంపైనా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన `సింగమ్ ఎగైన్` 2024లో భారీ మ‌ల్టీస్టార‌ర్ గా బ‌రిలో దిగుతోంది. ఇందులో OG సూపర్‌కాప్ చుల్బుల్ పాండే గా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అతిధి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుండి కాకపోయినా, చుల్బుల్ పాండే హిందీ సినిమా ఐకానిక్ క్యారెక్టర్. స్వతంత్ర సినిమా నుంచి పాత్ర ఇది. పోస్టర్ బాయ్ అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించిన `దబాంగ్`లో చుల్ బుల్ పాండే మొదట కనిపించాడు. అత‌డు అవినీతిపరుడైన పోలీసు అయినప్పటికీ గొప్ప హృదయం ఉన్నవాడిగా క‌నిపించాడు. సల్మాన్ ఆ త‌ర్వాత దబాంగ్ 2 , దబాంగ్ 3 లో చుల్బుల్ పాండే పాత్రను తిరిగి పోషించాడు. అయితే ద‌ర్శ‌కుడు అభినవ్ మొదటి భాగం తర్వాత ఫ్రాంచైజీ నుండి నిష్క్రమించాడు. చుల్బుల్ పాండేగా సల్మాన్ ఖాన్ చేరిక సింగం ఎగైన్ (సింగం 3)కి అద‌న‌పు బూస్ట్ నిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈ ఊహించని క్రాస్‌ఓవర్ బాజీరావ్ సింగం - చుల్‌బుల్ పాండే .. ఈ రెండు దిగ్గజ పాత్రలు మొదటిసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోవ‌డం కూడా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సింగమ్ ఫ్రాంచైజీకి ఎలక్ట్రిఫైయింగ్ హుషారును తీసుకురావ‌డానికి శెట్టి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తారాగణంలో సల్మాన్ ఖాన్ చేరిక మ‌రింత హీట్ ని పెంచింది. ఇది బాలీవుడ్ స్టార్స్ అభిమానులకు మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.

మ‌రోవైపు కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన భూల్ భుల‌యా 3 పైనా అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. స్త్రీ 2 భారీ విజ‌యం తర్వాత మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ చిత్రం కార్తీక్ ఆర్యన్ -భూల్ భూలయ్యా 3 విడుద‌ల‌వుతుండ‌డం ప్ర‌ధానంగా ఈ జాన‌ర్ కి ప్ల‌స్ అవుతుంద‌ని అంచ‌నా. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలో నటిస్తాడని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ దానిని మేక‌ర్స్ ధృవీక‌రించ‌లేదు.

భూల్ భులయ్యా అద్భుత‌మైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఫ్రాంఛైజీ. మొద‌టి భాగంలో అక్ష‌య్ న‌టించ‌గా, రెండో భాగంలో కార్తీక్ ఆర్య‌న్ న‌టించాడు. ఆ రెండు సినిమాలు బంప‌ర్ హిట్లు. అయితే రెండో భాగంలో అక్ష‌య్ న‌టించ‌క‌పోవ‌డంపై అభిమానులు నిరాశ చెందారు. మూడవ భాగం ఇప్పుడు 2024 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇందులోను కార్తీక్ ఆర్య‌న్ నటిస్తున్నారు. విద్యాబాలన్, ట్రిప్తి డిమ్రీ కథానాయికలుగా నటిస్తున్నారు. స్త్రీ 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన బాల‌న్ ఇప్పుడు బిబి 3లోను న‌టిస్తుండ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది. సీక్వెళ్లు ఢీ అంటే ఢీ.. అంటూ వ‌స్తున్నాయి. ఇద్ద‌రిలో పైచేయి ఎవ‌రిది? అనేది వేచి చూడాలి.