బాహుబలి 2.. కొట్టేవారే లేరా?
అందుకే ఈ స్ట్రాటజీని హీరోలు, దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు.
By: Tupaki Desk | 13 July 2024 5:23 AM GMTప్రస్తుతం సౌత్ లో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా కథని రెండు, మూడు భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా మొదటి సినిమా సెట్స్ పైన ఉండగానే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఎనౌన్స్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ ట్రెండ్ ఒకందుకు మంచిందని చెప్పొచ్చు. మొదటి సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా పార్ట్ 2 మీద హైప్ క్రియేట్ అవుతుంది. ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. అదే సమయంలో సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.
అందుకే ఈ స్ట్రాటజీని హీరోలు, దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. బాహుబలి సిరీస్ ఈ ట్రెండ్ ని అందరూ ఫాలో కావడానికి కారణం అయ్యింది. బాహుబలి మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మూవీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో పార్ట్ 2 మీద రాజమౌళి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. బాహుబలి పార్ట్ 1 సక్సెస్ బాహుబలి పార్ట్ 2 మీద భారీ అంచనాలు పెంచింది. దీంతో బాహుబలి 2 సినిమాపై అప్పటికి ఇండియన్ బాక్సాఫీస్ పై హైయెస్ట్ బిజినెస్ అయ్యింది.
భారీ ఓపెనింగ్స్ ని మూవీ అందుకుంది. ఇక కంటెంట్ పరంగా కూడా బాహుబలి పార్ట్ 1 కి మించి ఉందనే టాక్ తో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సౌత్ లో అత్యధిక కలెక్షన్స్ కి అందుకున్న చిత్రంగా బాహుబలి2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే బాహుబలి 2 తరహాలో సీక్వెల్స్ తో పెద్దగా ఎవరూ సక్సెస్ లు అందుకోలేదు. మొదటి సినిమాతో క్రియేట్ అయిన అంచనాలని అందుకోవడంతో దర్శకులు విఫలం అయ్యారు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మొదటి పార్ట్ కొంత పర్వాలేదనే టాక్ క్రియేట్ చేసిన పొన్నియన్ సెల్వన్ 2 డిజాస్టర్ అయ్యింది.
తాజాగా శంకర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియన్ మూవీ 1996లో రిలీజ్ అయిన అన్ని భాషలలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. అప్పుడే మూవీకి సీక్వెల్ ఉంటుందని శంకర్ క్లైమాక్స్ లో ప్రెజెంట్ చేశారు. అయితే 28 ఏళ్ళ తర్వాత శంకర్ ఇండియన్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇండియన్ మూవీ సక్సెస్ ట్రాక్ ని ఇండియన్ 2 క్యారీ చేయలేకపోయింది. సినిమా ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయలేదు. ఇండియన్ మూవీ సాంగ్స్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఆ తరహాలో ఇండియన్ 2 సాంగ్స్ పెద్దగా మెప్పించలేదు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ అని ఉన్న పాజిటివ్ వైబ్ ని కూడా ఇండియన్ 2 మూవీ అందుకోలేకపోయింది అనే మాట వినిపిస్తోంది. మొదటి రోజే సినిమాకి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వచ్చింది. బాహుబలి 1తో వచ్చిన హైప్ ని బాహుబలి 2 అందుకున్నట్లు ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ పై ఏ మూవీ అందుకోలేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. మరి కల్కి 2898ఏడీ, సలార్ పార్ట్ 2 కి బాహుబలి 2ని మ్యాచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే మొదటి పార్ట్స్ తో వచ్చిన హైప్ ని ఈ సినిమాల సీక్వెల్స్ ఎంత వరకు అందుకుంటాయనేది చూడాలి.