Begin typing your search above and press return to search.

ఈ కొనసాగింపు కథలు కిక్కిస్తాయా..

టాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుంచి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాలకు దర్శకులు సీక్వెల్స్ చేస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 5:13 AM GMT
ఈ కొనసాగింపు కథలు కిక్కిస్తాయా..
X

టాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుంచి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాలకు దర్శకులు సీక్వెల్స్ చేస్తూ వస్తున్నారు. మొదటి సినిమా షూటింగ్ దశలో ఉండగానే పార్ట్-2 అనౌన్స్ చేస్తున్నారు. ఒకవేళ పార్ట్-2 రిలీజ్ అయ్యి హిట్ అయితే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటిస్తున్నారు. ఆయా సినిమాలలోని హీరోల క్యారెక్టర్స్, లేదంటే కథ ప్రయాణం బేస్ చేసుకుని వరుసగా సీక్వెల్స్ చేయడానికి దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సీక్వెల్స్ పై హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ఇలా సీక్వెల్ ట్రెండ్ లో కొన్ని సినిమాలు పార్ట్ 2 దశలో ఉండగా, మరికొన్ని పార్ట్-3 కి వెళుతున్నాయి. ఇప్పటికే వాటికి సంబంధించిన అనౌన్స్ మెంట్స్ కూడా ఆయా హీరోలు, నిర్మాతల నుంచి వచ్చాయి. వీటిలో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉండడం విశేషం. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2కి సీక్వెల్ గా ఇండియన్ 3 ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ రిలీజ్ కావచ్చు. అలాగే రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని నిర్మాత ప్రకటించారు. కథ కూడా సిద్ధం అయిపోయిందని చెప్పారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పుష్ప సిరీస్ లో పార్ట్ 3 ని కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగే చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ చేస్తోన్న కార్తికేయ సిరీస్ లో మూడవ సినిమాని అఫీషియల్ గా పార్ట్ 2 రిలీజ్ సమయంలోనే అనౌన్స్ చేశారు. అడవి శేష్ సూపర్ హిట్ మూవీ గూడచారి ఫ్రాంచైజ్ లో ప్రస్తుతం పార్ట్ 2 తెరకెక్కుతోంది. దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుందంట. పొలిమేర 2 హిట్ కావడంతో పొలిమేర 3 సినిమాని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

నాచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ నుంచి వస్తున్న హిట్ సిరీస్ లో పార్ట్ 3 ఆయన హీరోగా స్టార్ట్ అవుతుందని రివీల్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ ఈ ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికి కంటిన్యూగా టిల్లు క్యూబ్ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఈ చిత్రాలన్ని కూడా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లోనే రెడీ కానున్నాయి. వీటిలో ఏది ఎక్కువగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందనేది వేచి చూడాలి.

ఈ సీక్వెల్స్ ట్రెండ్ లో రాబోయే పార్ట్ 3 మూవీస్ కూడా సూపర్ హిట్ అయితే వాటికి కొనసాగింపుని కూడా మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. టిల్లు క్యారెక్టర్ తో సితారా వాళ్ళు ఎక్కువ మూవీస్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. అలాగే నాని ప్రొడక్షన్ లో హిట్ సిరీస్ కూడా కొనసాగొచ్చు. గూడచారి ఫ్రాంచైజ్ లో అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కథలు చెప్పే అవకాశం ఉంది. కార్తికేయలో హీరో క్యారెక్టర్జేషన్స్ తో డిఫరెంట్ స్టోరీస్ ని చెప్పాలని చందు మొండేటి ప్లానింగ్ లో ఉన్నారు.