Begin typing your search above and press return to search.

ఒక్క హీరోయిన్‌ కోసం ఇద్దరు హీరోల సీరియస్ లవ్‌ వార్‌..!

వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jan 2025 5:43 AM GMT
ఒక్క హీరోయిన్‌ కోసం ఇద్దరు హీరోల సీరియస్ లవ్‌ వార్‌..!
X

ఈమధ్య కాలంలో వెండి తెరపై ప్రేమ కథలు రావడం చాలా అరుదుగా మారింది. ముఖ్యంగా స్టార్‌ హీరోలు పూర్తి యాక్షన్ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో లవ్‌ మూవీస్‌ కొరత ఏర్పడింది. గతంలో ఎక్కువగా వచ్చిన ట్రై యాంగిల్ లవ్‌ స్టోరీ సినిమాలు అసలు కనిపించడం లేదు. ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి బాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం రూపొందిస్తున్న భారీ లవ్‌ అండ్ యాక్షన్‌ మూవీ 'లవ్‌ అండ్ వార్‌'. బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌, విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రై యాంగిల్‌ లవ్ స్టోరీ మూవీలో రణబీర్‌ కపూర్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం రణబీర్‌ కపూర్, విక్కీ కౌశల్ మధ్య సాగే అతి పెద్ద యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణ జరుపుతున్నారు. ఇద్దరు హీరోల మధ్య సాగే ఈ లవ్ వార్ యాక్షన్‌ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తనదైన మార్క్‌తో ఈ యాక్షన్‌ సీన్స్‌ను రూపొందిస్తున్నాడట. భారీ మొత్తంలో ఈ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణకు ఖర్చు చేస్తున్నారు అని సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు సంజయ్‌ లీలా భన్సాలీ ఎక్కువగా పీరియాడిక్ డ్రామా, యాక్షన్ డ్రామా సినిమాలు చేశాడు. కానీ మొదటి సారి ఒక ట్రై యాంగిల్‌ లవ్‌ స్టోరీతో రాబోతున్నాడు. కథలో ఉండే ట్విస్ట్‌లతో పాటు దర్శకుడు చూపించే స్క్రీన్‌ ప్లేతో సినిమా సూపర్ హిట్‌ కావడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. లవ్‌ అండ్ వార్‌ టైటిల్‌లోనే కథను సగానికి పైగా చెప్పేశాడు. సినిమాలో ప్రేమ ఉంటుంది.. ఆ ప్రేమ కోసం వార్‌ జరుగనుందని క్లియర్‌గా ఉంది. కనుక లవ్‌ సీన్స్‌తో పాటు సినిమాలో రణబీర్ కపూర్‌, ఆలియా భట్‌ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్ జంటగా నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన దక్కుతుంది అనేది చూడాలి. ఈ సినిమాలో రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ల పాత్రలు ఎలా ఉంటాయి, వారి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. మార్చి 20, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ ముగించనున్నారు.