Begin typing your search above and press return to search.

శ్రుతి ఎక్స్ శేష్.. పోస్టర్ తోనే కిక్కిచ్చేలా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హీరో అడవి శేష్

By:  Tupaki Desk   |   14 Dec 2023 6:39 AM GMT
శ్రుతి ఎక్స్ శేష్.. పోస్టర్ తోనే కిక్కిచ్చేలా..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హీరో అడవి శేష్. ఒకవైపు రైటర్ గాను మరోవైపు హీరోగానూ సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది మేజర్, హిట్2 లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అడవి శేష్ ప్రస్తుతం గూఢచారి సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం.


అయితే గూఢచారి సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేశారు అడవి శేష్. అందుకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. అడవి శేష్ కు జోడీగా శ్రుతి హాసన్ నటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా శ్రుతి.. అడవి శేష్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను డిసెంబర్ 18న ప్రకటిస్తామని తెలిపింది.

ప్రస్తుతం అడవి శేష్ ఫస్ట్ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. సినిమా ఫుల్ మిస్టీరయస్ గా ఉండనున్నట్లు అర్ధమవుతోంది. చెవికి గోల్డ్ రింగ్, ముఖానికి బ్లాక్ స్క్రార్ఫ్.. అడవి శేష్ లుక్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. శ్రుతిహాసన్.. తన ఇన్ స్టాగ్రామ్ లో హీరో ఫస్ట్ లుక్ షేర్ చేసి సినిమపై అంచనాలను మరింత పెంచింది.

ఈ మూవీ ని తెలుగు, హిందీ భాషలలో ఒకే సారి తెరకెక్కించునున్నట్లు తెలుస్తోంది. శానిల్ డియో దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో అడవి శేష్ నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ సమయంలో క్షణం మూవీతో సూపర్ హిట్ సాధించారు అడవి శేష్. ఈ మూవీ విజయం తర్వాత ఆయన ఎక్కువ శాతం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లలోనే హీరో గా నటిస్తూ వస్తున్నారు. చివరగా శేష్.. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలతో శేష్ బిజీ కానున్నారన్నమాట.