SSMB29 సెట్ పిక్స్ లీక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!
ఇదే సమయంలో సోషల్ మీడియాలో సినిమా గురించి రోజుకో పుకారు పుట్టుకు వస్తుంది. ఏ వార్త నిజం, ఏది అబద్దం తెలియక ఫ్యాన్స్ బాబోయ్ అంటూ తల బాదేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 5 March 2025 5:59 AMసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సినిమా గురించి రోజుకో పుకారు పుట్టుకు వస్తుంది. ఏ వార్త నిజం, ఏది అబద్దం తెలియక ఫ్యాన్స్ బాబోయ్ అంటూ తల బాదేసుకుంటున్నారు. మహేష్‌బాబు గత ఏడాది కాలంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొన్నారు. రాబోయే ఏడాది కాలం పాటు షూటింగ్‌లో పాల్గొంటారు. సినిమా విడుదల ఎప్పుడు, సినిమా షూటింగ్ ఎప్పటి వరకు అనే విషయాలను రాజమౌళి ఇప్పటి వరకు ప్రకటించలేదు.
సినిమాను ప్రారంభించినట్లు కూడా ఇప్పటి వరకు రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. ఆ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాను ప్రారంభించారు. ఇంకా అక్కడ షూటింగ్ జరుగుతుందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు. త్వరలో ఆఫ్రికాకు యూనిట్ సభ్యులు అంతా వెళ్లబోతున్నారని, అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధం అవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లే ముందు మీడియా ముందుకు రాజమౌళి అండ్ టీం వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఎప్పుడు రాజమౌళి మీడియా ముందుకు వస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మీడియా సమావేశం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి గత సినిమాల షూటింగ్ సమయంలో, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో లీక్ సమస్య ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి లీక్ సమస్య లేకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని వార్తలు వచ్చాయి. రాజమౌళి ఎంత కష్టపడ్డా లీక్ మాత్రం ఆపలేక పోయారు అని టాక్ వినిపిస్తుంది. రాజమౌళి గత కొన్నాళ్లుగా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సెట్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాత కాలంలో కాశి నగరం ఇలా ఉండేది, ఆ సెట్‌లోనే సినిమా షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోలకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ లేదు.
మహేష్ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న సినిమాకు సంబంధించిన పిక్స్ ఒక్కటి కూడా బయటకు వచ్చి ఉండదని, కాశి నగరం అంటూ కొందరు ప్రచారం చేస్తున్న ఫోటోలతో సినిమాకు సంబంధం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. మహేష్ బాబు సినిమా అడ్వంచర్ అనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాశి నగరం ఎందుకు సినిమాలో ఉంటుందని కొందరు లాజిక్‌గా ప్రశ్నిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటి అనేది తెలియాలి అంటే రాజమౌళి మీడియా సమావేశం వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.