ఆరు ఏళ్లలో పాతిక ఎలా కొట్టావ్ భయ్యా...!
అలాంటి సమయంలో ఒక్కరు ఇద్దరు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2024 4:37 AM GMTఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి అయిదు పది సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి అంటూ వార్తల్లో చూడటం తప్ప ఈతరం హీరోలు అందుకోసం మినిమం ప్రయత్నిస్తున్న దాఖలాలు కూడా లేవు. అలాంటి సమయంలో ఒక్కరు ఇద్దరు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సినిమా మేకింగ్ కి పెరిగిన ఖర్చుల నేపథ్యంలో హీరోలు ఒకేసారి ఎక్కువ సినిమాలు చేసేందుకు ముందుకు రావడం లేదు. మరో వైపు దర్శక నిర్మాతలు కూడా ఒకేసారి చాలా సినిమాలను రూపొందించేందుకు ధైర్యం చేయడం లేదు. అయితే విజయ్ సేతుపతి వంటి వారు మాత్రం ఏడాదికి అటు ఇటుగా అర డజను సినిమాలు లాగిస్తున్నారు.
ముఖ్యంగా విజయ్ సేతుపతి సినిమాల జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏడాదికి అయిదు పది సినిమాలు చేయడం అంటే మామూలు విషయమే. కానీ హీరోగా, విలన్ గా ఇంకా ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఎక్కువ సినిమాలు చేస్తున్న ఘనత కేవలం విజయ్ సేతుపతికే దక్కింది.
హీరోగా ఒక వైపు వరుస సినిమాలు చేస్తూ మరో వైపు ఇతర పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతికి దక్కిన పాన్ ఇండియా గుర్తింపు కారణంగా అన్ని భాషల్లో కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. గడచిన ఆరు ఏళ్లలో ఏకంగా పాతిక సినిమాలు చేసి అరుదైన ఘనత దక్కించుకున్నాడు.
తాజాగా విజయ్ సేతుపతి 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే పాతిక సినిమాలను చేయడం ద్వారా హాఫ్ సెంచరీ కి చాలా త్వరగా చేరవ అయ్యాడు. విజయ్ సేతుపతి జోరు చూస్తూ ఉంటే 2030 రాక ముందే సెంచరీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంత స్పీడ్ గా సినిమాలు ఎలా చేస్తున్నావు భయ్యా అంటూ ఆయన సన్నిహితులు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటూ ఉంటారట. ఆయన జోరుకు ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో చేసేస్తున్నాం అన్నట్లుగా కాకుండా మంచి సినిమాలను చేయడం ద్వారా అందరి అభిమానం దక్కించుకుంటున్నాడు.