Begin typing your search above and press return to search.

ఎన్నికల తర్వాత థియేటర్లలో కళ.. ఈ వీక్ విన్నర్ ఎవరో?

ప్రతి వారం థియేటర్లలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   13 Jun 2024 7:01 AM GMT
ఎన్నికల తర్వాత థియేటర్లలో కళ.. ఈ వీక్ విన్నర్ ఎవరో?
X

ప్రతి వారం థియేటర్లలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు బడా హీరోల సినిమాల సందడే లేదు. జూన్ చివరి వారం నుంచి వరుసగా విడుదల కానున్నాయి. ఇక సమ్మర్ లో ఎప్పుడూ పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి సీన్ రివర్స్ అయింది. పెద్ద మూవీలు పోస్ట్ పోన్ అయ్యాయి. అది కాక.. ఐపీఎల్ తో పాటు ఎన్నికల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు వెలవెలబోయాయి.

ఇక ఎన్నికలు, ఐపీఎల్ ముగిసిన తర్వాత.. మే 31 నుంచి థియేటర్లు మళ్లీ కళకళలాడాయి. ముగ్గురు యంగ్ హీరోల చిత్రాలు రిలీజ్ అయ్యాయి. రెండు మంచి టాక్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ వారం పలు సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధమైపోయాయి. టీ20 వరల్డ్ కప్ అవుతున్నా అంతగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎన్నికలు సందడి పూర్తిగా ముగియడంతో ఈ వీక్ విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందనే ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. హరోం హర మూవీతో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు జ్ఞానసాగర్ తెరకెక్కించిన ఈ సినిమాలో తుపాకీలు తయారు చేసే రోల్ లో సుధీర్ బాబు కనిపించనున్నారు. ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేశారు మేకర్స్.

కలర్ ఫోటో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన హీరోయిన్ చాందినీ చౌదరి.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ వారం ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అజయ్ ఘోష్ టైటిల్ రోల్ లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తిలో చాందిని యాక్ట్ చేసింది. ఈ మూవీ కంటెంట్ ద్వారా సూపర్ హిట్ అవుద్దని మేకర్స్ అంతా నమ్మకంగా ఉన్నారు. చాందిని యేవమ్ మూవీ కూడా శుక్రవారమే రిలీజ్ కానుంది.

వీటితోపాటు మరో రెండు స్టైయిట్ సినిమాలు ఇంద్రాణి, నీ దారే నీ కథ విడుదల కానున్నాయి. మరోవైపు, విజయ్ సేతుపతి మహారాజా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రేపు విడుదల కానుంది. హైదరాబాద్ లో విజయ్ తెగ ప్రమోషన్లు నిర్వహిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ చందూ ఛాంపియన్ మూవీ పై నార్మల్ బజ్ ఉంది. మరి ఎన్నికల సందడి పూర్తిగా ముగిసిన తర్వాత వస్తున్న ఈ సినిమాలన్నింటిలో ఏది విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.