లిప్ లాక్ వేస్తానంటే నా భర్త పర్మిషన్ దేనికన్నారు!
రణవీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` గతేడాది రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Oct 2024 4:30 PM GMTరణవీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` గతేడాది రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో జయాబచ్చన్, ధర్మేంద్ర, షబానీ అజ్మీ సైతం కీలక పాత్రల్లో మెప్పించారు. సినిమాలో సీనియర్ నటులైన ధర్మేంద్ర- షబానీ అజ్మీ మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది. వయసు ముదిరిన వాళ్లతో లిప్ లాక్ ఏంటి? అని అప్పట్లో బాలీవుడ్ లో విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా ఈ లిప్ లాక్ సన్నివేశం గురించి షబానా అజ్మీ స్పందించారు. `మేకర్స్ నన్ను సంప్రదించగానే కథ నచ్చడంతో అంగీకరించాను. ఇందులో లిప్ లాక్ సన్నివేశం గురించి కరణ్ ముందుగానే వివరించారు. ఈ విషయం గురించి నా భర్తని అడిగితే? ఇది చాలా చిన్న విషయం. దీనికి నా అనుమతి ఎందుకు? అన్నారు. సన్నివేశం డిమాండ్ చేస్తే నటిగా కొన్ని పరిమితులు దాటి నటించడంలో తప్పేం లేదు.
ప్రేక్షకులంతా కుటుంబ సమేతంగా చూసిన చిత్రమిది. నేను పోషించి అతిధి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది` అన్నారు. అయితే ఇదే సన్నివేశం గురించి గతంలో ఆమె కాస్త రొమాంటిక్ గాను స్పందించారు. బలంగా ఉండే స్త్రీ జీవితంలో రొమాన్స్ ఉండకూడదా? సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. కరణ్ జోహార్ ఎంతో రిస్క్ తీసుకుని ఈ సీన్ పెట్టారు. సినిమాకి వచ్చిన ఆదరాభిమానలన్నీ ఆయనకే సొంతం` అని అన్నారు.
అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఇంకొంతమంది కొత్త నటీనటులు కూడా యాడ్ అవుతారు. పాత టీమ్ ని యధావిధిగా కొనసాగిస్తూనే అవసరం మేర కొత్త నటీనటుల్నీ రంగంలోకి దించుతారు. అయితే వాళ్లంతా కచ్చితంగా బాగా ఫేమస్ అయిన వాళ్లే అయి ఉండాలి. కరణ్ సినిమాలో ఈ రూల్ తప్పక ఉంటుంది.