Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ కేసులో సంచ‌ల‌న‌ తీర్పుపై చిత్రం

ముస్లిమ్ చట్టం ప్ర‌కారం భార్యాభ‌ర్త‌లు క‌లిసి ఉన్నంత కాలం మాత్ర‌మే భ‌ర్త మ‌ద్ధ‌తు భార్య‌కు ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:30 PM GMT
ట్రిపుల్ త‌లాక్ కేసులో సంచ‌ల‌న‌ తీర్పుపై చిత్రం
X

ముస్లిమ్ చట్టం ప్ర‌కారం భార్యాభ‌ర్త‌లు క‌లిసి ఉన్నంత కాలం మాత్ర‌మే భ‌ర్త మ‌ద్ధ‌తు భార్య‌కు ఉంటుంది. కానీ హిందూ చ‌ట్టం అలా కాదు. అయితే నాలుగు ద‌శాబ్ధాల క్రితం ఓ ముస్లిమ్ మ‌హిళ‌ భ‌ర‌ణం కేసులో సుప్రీంలో విజ‌యం సాధించ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కాలానికి ఈ సంచ‌ల‌న తీర్పుపై ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఏప్రిల్ 1978లో 62 ఏళ్ల షా బానో బేగం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత సిఆర్‌పిసి సెక్షన్ 125 కింద భరణం కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే త‌న‌ భర్త మొహమ్మద్ అహ్మద్ ఖాన్ దీనికి వ్యతిరేకంగా వాదించారు. ముస్లిముల చ‌ట్ట ప్ర‌కారం క‌లిసి లేన‌ప్పుడు అత‌డు డ‌బ్బు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ దీనిపై సుప్రీం విచార‌ణ‌లో సంచ‌ల‌న తీర్పు వెలువ‌డింది. దాదాపు ఏడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఏప్రిల్ 1985లో షా బానోకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

షా భానో సుదీర్ఘ న్యాయ‌పోరాటం, ధైర్యంపై సినిమా తెర‌కెక్కించ‌డానికి న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు సుప‌ర్ణ ముందుకు వ‌చ్చారు. ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ విశాల్ గుర్నాని - సిర్ఫ్ ఏక్ బండా కాఫీ హైని నిర్మించిన ఇన్సోమ్నియా మీడియాకు చెందిన జూహి పరేఖ్ మెహతా బవేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మాన్ బవేజాతో కలిసి నిర్మిస్తారు.

దాదాపు 40 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ నిజ‌ఘ‌ట‌న‌పై సినిమా తెర‌కెక్కుతోంది. తాజా క‌థ‌నాల ప్ర‌కారం... ఇందులో షా భానో పాత్ర‌లో యామి గౌత‌మ్ న‌టిస్తోంది. ఆర్టికల్ 370 లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రంలో యామి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మ‌రో ప్రయోగాత్మ‌క పాత్ర‌లో యామి అవ‌కాశం అందుకుంది.

ఈ సినిమాను జిగ్నా వోరా ర‌చ‌న ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇంకా న‌వ‌ల రిలీజ్ కాక ముందే క‌థాంశాన్ని కొనుగోలు చేసారు. జిగ్నా ర‌చ‌న‌ `బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా: మై డేస్ ఇన్ ప్రిజన్` ఆధారంగానే 2023 నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `స్కూప్` తెర‌కెక్కింది. రాణా నాయుడు ఫేం సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఇల్లీగల్, హీరా మండి చిత్రాలకు పనిచేసిన రేషు నాథ్ స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టాల్సి ఉంది.