వింతైన అరుపులు నాలో ఆందోళన పెంచాయి!
ఇటీవలే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Sep 2024 4:30 PM GMTఇటీవలే బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తండ్రిగా రణవీర్ సింగ్ ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో దీపిక పాపాయి గురించే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్యన్ ఖాన్ పుట్టుక అంశం తెరపైకి వచ్చింది. షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ లో ముద్దుల కొడుకు అర్యన్ ఖాన్ అన్న సంగతి తెలిసిందే. కుమారుడిని ఎంతో గారాబంగా పెంచారు.
తాజాగా ఓ టాక్ షోల్ ఆర్యన్ ఖాన్ పుట్టుక గురించి షారుక్ ఖాన్...ప్రసవ సమయంలో గౌరీఖాన్ ఎంతగా ఇబ్బంది పడ్డారా? ఆ నాటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే... `ఒక స్త్రీ ప్రసవ వేదనకు గురైనప్పుడు ఎలా స్పందిస్తుందో నాకు తెలియదు. మీరు ఆమెతో ఊపిరి పీల్చుకోవాలని చెబుతున్నారు. అది నేను బాగా విన్నాను. కానీ ఆమె సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం లేదు.
ఆమె చాలా వింతగా అరుస్తోంది. ఆ అరుపులు నాలో ఆందోళన మరింత పెంచాయి. అంతవరకూ అలాంటి సందర్భం ఎదుర్కోలేదు. దీంతో కొంచెం భయపడ్డాను` అన్నారు. డెలివిరీ సమయంలో స్పాట్ లో ఉన్నా రా? అంటే` షారుక్ తల ఊపాడు. అవును. నేను అక్కడే ఉన్నాను` అని అన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. పఠాన్, జవాన్, డంకీలతో వరుస విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే.
దీంతో షారుక్ మళ్లీ కొన్ని నెలలుగా విరామంలో ఉన్నాడు. మరి ఈ ఏడాది కొత్త ప్రాజెక్ట్ గురించి రివీల్ చేస్తారా? వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయిస్తాడా? అన్నది చూడాలి. హిట్ వచ్చినా..ప్లాప్ వచ్చిన షారుక్ కి గ్యాప్ తీసుకోవడం అలవాటు. హిట్ కొడితే అది బాక్సాఫీస్ చరిత్రలో నిలిచిపోవాలి అన్నట్లే ప్లాన్ చేస్తారు.