Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుబులు పుట్టించే వార్త‌

బ్లాక్ బస్టర్ గూఢచారి సినిమా సీక్వెల్ పై ఇప్పుడు చాలా వ‌ర‌కూ క్లారిటీ వ‌చ్చింది. 'పఠాన్ 2' సీక్వెల్ అధికారికం అయింది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 9:30 AM GMT
సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుబులు పుట్టించే వార్త‌
X

కొన్ని వ‌ర‌స ప‌రాజ‌యాల‌తో విసిగిపోయిన షారూఖ్ కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ 'ప‌ఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అజేయంగా 1000 కోట్ల క్ల‌బ్లో అడుగుపెట్టింది. ఇది ఖాన్ కి ఐదేళ్ల అనంత‌రం సంతృప్తిక‌ర‌మైన కంబ్యాక్. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. అందుకే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా? అన్న ఉత్కంఠ అంద‌రిలోను ఉంది.

ప‌ఠాన్ కి స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది అని తెలుసు కానీ, అది ఏ ద‌శ‌లో ఉందో ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ఠ‌త లేదు. అయితే ఇప్ప‌టికి దీనికి సంబంధించిన అప్ డేట్ వ‌చ్చింది. ప‌ఠాన్ ర‌చ‌యిత అబ్బాస్ టైరేవాలా 'పఠాన్ 2' స్క్రిప్టు రెడీ అయిందని, డైలాగ్ వెర్ష‌న్ రాయాల్సి ఉందని వెల్లడించారు. షారుఖ్ ఖాన్ పఠాన్‌గా తిరిగి వస్తాడు. దీపికా పదుకొణే తన పాత్రను తిరిగి పోషించే అవకాశం ఉంది. సీక్వెల్ YRF స్పై యూనివర్స్‌లో భాగం.. 2024 చివరి నాటికి చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నార‌ని తెలుస్తోంది.

షారూఖ్ ఖాన్ అభిమానులకు ఇది నిజంగా విన‌సొంపైన క‌బురు. బ్లాక్ బస్టర్ గూఢచారి సినిమా సీక్వెల్ పై ఇప్పుడు చాలా వ‌ర‌కూ క్లారిటీ వ‌చ్చింది. 'పఠాన్ 2' సీక్వెల్ అధికారికం అయింది. సైరస్ బ్రోచాతో పోడ్‌కాస్ట్‌లో ప్రఖ్యాత స్క్రీన్ రైటర్ అబ్బాస్ టైరేవాలా మాట్లాడుతూ .. ప‌ఠాన్ 2కి డైలాగ్ లు రాసే ద‌శ‌లో ఉన్నామ‌ని వెల్లడించడంతో తిరిగి ఖాన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మొద‌లైంది. షారూఖ్ ఖాన్ RAW ఏజెంట్ గా న‌టించిన‌ పఠాన్ యాక్షన్ కంటెంట్ తో మాస్ ని విప‌రీతంగా ఆక‌ర్షించింది. సీక్వెల్ లో ఖాన్ ప‌ఠాన్ గా తిరిగి వ‌స్తుంటే, దీపికా పదుకొణే రుబీనాగా తిరిగి వచ్చే అవకాశం ఉందని స‌మాచారం. ఏది ఏమైనప్పటికీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ 2024 చివరి నాటికి నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సీక్వెల్ YRF విస్తరిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగం. ఈ భారీ విస్పోట‌న‌ విశ్వంలో హృతిక్ రోషన్ 'వార్', సల్మాన్ ఖాన్ 'టైగర్3' ఇప్ప‌టికే వ‌చ్చాయి. అలియా భట్ 'ఆల్ఫా' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ప్ర‌స్తుతం SRK బ‌య‌టి బ్యాన‌ర్ లో 'కింగ్' అనే చిత్రం చేస్తున్నారు. సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం 2026 ఈద్ సందర్భంగా విడుద‌ల కానుంది.