1000 కోట్ల వసూళ్ల సినిమాకి సీక్వెల్ సిద్దం!
షారుక్ ఖాన్ - సిద్దార్ధ్ ఆనంద్ -యశ్ రాజ్ ఫిలింస్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `పఠాన్` ఎలాంటి విజయం సాధించిందో తోలిసిందే.
By: Tupaki Desk | 25 Feb 2025 10:30 PM GMTషారుక్ ఖాన్ - సిద్దార్ధ్ ఆనంద్ -యశ్ రాజ్ ఫిలింస్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `పఠాన్` ఎలాంటి విజయం సాధించిందో తోలిసిందే. 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. యశ్ రాజ్ ఫిలింస్ లో గొప్ప యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అయితే ఈసినిమాకి సీక్వెల్గా `పఠాన్ 2` కూడా ఉంటుందని ప్రకటించారు.
ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా `పఠాన్ 2` వార్తలు బయటకు వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే `పఠాన్ 2` స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. సీక్వెల్ కథని పూర్తిగా ఆదిత్య చోప్రా- శ్రీధర్ రాఘవన్, అబ్బాస్ టైరేవాలా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. `పఠాన్` కు పునాది వేసింది సిద్ధార్ద్ ఆనంద్. ఆయనే ఈ కథని రాసారు.
స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్ అందించారు. అయితే సీక్వెల్ మాత్రం సిద్దార్ద్ ఆనంద్ దర్శకుడు కాదని తొలి నుంచి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో `పఠాన్ 2` పనులన్నీ ఆదిత్య చూసుకున్నట్లు తెలుస్తోంది. `పఠాన్` కంటే మరింత స్ట్రాంగ్ స్క్రిప్ట్ సిద్దమైనట్లు సమాచారం. ఆదిత్య చోప్రా ఇటీవలే షారుక్ ఖాన్ కి స్క్రిప్ట్ కూడా నేరేట్ చేసినట్లు తెలిసింది. సీక్వెల్ కోసం తాను కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు షారుక్ కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అన్నది చూడాలి. ప్రస్తుతం ఆదిత్యా చోప్రా ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం. అటుపై 2026లో చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.