Begin typing your search above and press return to search.

ఐఫా 2024: ఊ అంటావా.. సూప‌ర్ రొమాన్స్ గురూ

ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లో ఒక అగ్ర న‌టుడు ఎలాంటి భేష‌జం లేకుండా సౌత్ సినిమాల‌ గొప్ప‌త‌నాన్ని అంగీక‌రిస్తున్న రోజులివి.

By:  Tupaki Desk   |   29 Sep 2024 6:00 AM GMT
ఐఫా 2024: ఊ అంటావా.. సూప‌ర్ రొమాన్స్ గురూ
X

ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లో ఒక అగ్ర న‌టుడు ఎలాంటి భేష‌జం లేకుండా సౌత్ సినిమాల‌ గొప్ప‌త‌నాన్ని అంగీక‌రిస్తున్న రోజులివి. తెలుగు, తమిళం, మ‌ల‌యాళం, కన్న‌డం .. భాష ఏదైనా ఉత్త‌రాది ప్రేక్ష‌కులు గొప్ప‌గా మ‌న సినిమాల‌ను ఆద‌రిస్తుంటే స్టార్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇది అనూహ్య‌మైన మార్పు కాదు.. కాల‌క్ర‌మంలో జ‌రిగిన మార్పు. ప్ర‌జ‌ల ఐడియాల‌జీలో వ‌చ్చిన ఈ మార్పును సూప‌ర్ స్టార్లు సైతం గ్ర‌హించి తెలివైన నిర్ణ‌యంతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగు స్టార్ల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్లు చేసేందుకు బాలీవుడ్ స్టార్లు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం కొత్త ప‌రిణామం.

ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి దూసుకొచ్చిన‌ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ `పుష్ప` నుంచి `ఊ అంటావా..`(స‌మంత‌) పాట‌కు ప్రతిష్టాత్మక IIFA 2024 (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుక‌లో బాలీవుడ్ కి చెందిన ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు అరుదైన ఫ‌న్ క్రియేట్ చేస్తూ డ్యాన్సు చేయడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌గా మారింది. ఐఫా 24వ ఎడిషన్ రెండవ రోజు అబ్బురపరిచే వేడుకలతో కొనసాగ‌గా వేదిక‌పై షారుఖ్ ఖాన్ - విక్కీ కౌశ‌ల్ ఎంతో సంద‌డి చేసారు.

ఆస‌క్తిక‌రంగా పుష్ప నుండి హిట్ ట్రాక్ `ఊ అంటావా` కోసం సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ స్టేజ్‌పై విక్కీ కౌశల్‌తో చేరాడు. SRK ఎంతో ఎన‌ర్జిటిక్ గా ఫ‌న్నీగా స్టెప్పు క‌లిపి ప్రేక్షకులను విస్మయానికి గురి చేశారు. అంత పెద్ద హీరో ఒదిగి ఉండే త‌త్వం ఈ వేదిక‌పై ఎలివేట్ కాగా, అత‌డికి విస్తృత ప్రశంసలు ద‌క్కాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరపురాని అద్భుత‌మైన క్ష‌ణాలతో నిండిన IIFA మహోత్సవం ఈ రాత్రికి దుబాయ్‌లో ముగుస్తుంది. ఇప్ప‌టికే తెలుగు స్టార్లు అవార్డులు అందుకున్న ఆనందంలో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ కార్యక్రమంలో బాబీ డియోల్, రేఖ, కృతి సనన్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ తారలు పాల్గొన్నారు.