ప్రేమికుడా రేపిస్టా? స్టార్ హీరోపై విద్యావేత్త ఫైర్!
నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో షారూఖ్ నటనకు ప్రశంసలు కురిసాయి.
By: Tupaki Desk | 12 Sep 2024 4:45 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భారతదేశంలో గొప్ప రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. అతడు నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జే) కొన్నేళ్ల పాటు థియేటర్లలో విజయవంతంగా ఆడింది. ప్రేమికుల గుండె చప్పుడుగా డీడీఎల్‌జే హృదయాలను నిరంతరం స్పర్శిస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ప్రేమకథా చిత్రంగా రికార్డులకెక్కింది. అయితే ఇదే రొమాంటిక్ హీరో షారూఖ్ `డర్`(1993) అనే సినిమాలో వాంఛతో అమ్మాయి వెంటపడేవాడిగా, రేపిస్టును తలపించే పాత్రలో నటించాడు. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో షారూఖ్ నటనకు ప్రశంసలు కురిసాయి.
డర్ చిత్రంలో ప్రమాదకారిగా షారూఖ్ కనిపించాడని సాంప్రదాయవాదులు విమర్శిస్తూనే ఉంటారు. చాలా కాలంగా ఈ పాత్రపై విమర్శలు ఉన్నాయి. ఈ చిత్రంలో `తు హాన్ కర్ యా నా కర్, తు హై మేరీ కిరణ్` (నువ్వు అవునన్నా కాదన్నా నీవే నాదానివి.. కిరణ్) అనే పాట కూడా ఉంది. ఇది ఒక యువతిని వెంబడించడం.. కీర్తిస్తూనే ఆమెను పొందాలనే కోరికను వ్యక్తపరచడం వంటి విషయాలను చెబుతుంది.
ఇటీవల విద్యావేత్త డాక్టర్ వికాస్ దివ్యకీర్తి `డర్` సినిమా కథనాన్ని ప్రశ్నించారు. షారూఖ్ పాత్రను ప్రేమికుడిగా చూపించారా? లేక డార్క్ రోల్ గా చూపారా? అని ప్రశ్నించారు. ఇందులో షారుఖ్‌ను అనారోగ్యకరమైన వ్యామోహంతో .. మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిగా చూపించారు. ఈ చిత్రం ఇబ్బందికరమైన ప్రవర్తనను ఎలా శృంగారభరితం చేసింది? అనేదానిని ప్రశ్నించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చాటింగ్ సెషన్ లో వికాస్ `డర్` మూవీపై మాట్లాడుతూ విపరీతంగా స్పందించాడు. ఇందులో షారుఖ్ ఖాన్ .. జూహీ చావ్లా వెంటపడుతుంటాడు. ఆమె నో చెబుతుంది. అతడు ``తు హాన్ కర్ యా నా కర్, తు హై మేరీ కిరణ్`` అని పాడాడు. అంటే అతడు జూహీచావ్లా సమ్మతిని పట్టించుకోడు. మీరు అవును అని చెప్పినా.. లేదా మీరు కాదని చెప్పినా నీవు నాదానివే! అని వెంబడిస్తుంటాడు. యే లవర్ హై యా రేపిస్ట్ హై? యే కైసీ సెన్స్ హై? (అతడు ప్రేమికుడా లేక రేపిస్టునా? ఇది ఏ భావం?) ఇది క్రూరమైన మగతనం అని విమర్శించాడు.
వికాస్ సమాజంలో రెగ్యులర్‌గా ఆమోదించిన `కాంప్లిసిట్` మగతనం ఆలోచన గురించి మాట్లాడాడు. అతడు `కభీ కబీ`లోని పాటను ఒక ఉదాహరణగా ఉపయోగిస్తూ విశ్లేషించాడు. ఈ పాటలో స్త్రీ పురుషుడి కోసం మాత్రమే ఉందని సాహిత్యం సూచిస్తుంది. అతడి కోసం ఆమెను నక్షత్రాల నుండి క్రిందికి రావాల్సిందిగా పిలుస్తాడు. ``కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై కి జైసే తుజ్కో బనాయా గయా హై మేరే లియే`` (కొన్నిసార్లు మీరు నా కోసం తయారు చేయబడ్డారని నేను అనుకుంటాను). నువ్వు నా కోసం తయారు చేసిన వస్తువు. తు అబ్ సే పెహ్లే సితారో మే బాస్ రహీ థీ కహిన్, తుఝే జమీన్ పే బులాయా గయా హై మేరే లియే (మీరు ఇంతకు ముందు నక్షత్రాలలో నివసించేవారు. మీరు నా కోసం పిలిచారు.) ఇది ఎలాంటి యజమాని వ్యక్తిత్వం? ఏ బాస్ ఆమెను స్టార్ నుండి దించేశాడు. ఆమెకు సొంత జీవితం లేదా? ఆమెకు సొంత కెరీర్ లేదా? ఆమె సొంత కలలు? ``మీరు నాకు పూర్తి అనుభూతిని కలిగించే వ్యక్తిగా ఉండాలి.. అది భూమిపై ఉండటంలో మీ ఏకైక ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. డర్ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన సంగతి తెలిసిందే. యష్ చోప్రా దర్శకత్వం వహించారు.
విధు వినోద్ చోప్రా ట్వల్త్ ఫెయిల్ లో ప్రొఫెసర్ వికాస్ నటించారు. మనోజ్ శర్మ ట్వల్త్ ఫెయిల్ అయినప్పటి నుండి IPS అధికారి అయ్యే వరకు సాగించిన నిజమైన పోరాట కథ నుండి ప్రేరణ పొంది ఈ సినిమాని రూపొందించారు. UPSC ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి స్వయంగా ఈ చిత్రంలో నటించారు. అతడు ఇంతకుముందు రణబీర్ కపూర్ యానిమల్‌ను `ఫుహాద్ ఔర్ బద్తమీజ్ ఫిల్మ్` అని కామెంట్ చేసారు.