Begin typing your search above and press return to search.

పొరుగింటి పుల్ల కూరపై మోజు దెబ్బ కొట్టిందా?

తాజాగా అత‌డి ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. షాహిద్ మరోసారి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ర‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు ఈ గెట‌ప్‌లో.

By:  Tupaki Desk   |   2 Jan 2025 3:57 AM GMT
పొరుగింటి పుల్ల కూరపై మోజు దెబ్బ కొట్టిందా?
X

ఓవైపు అనురాగ్ క‌శ్య‌ప్ లాంటి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు బాలీవుడ్ లో రీమేక్ లు తీసే వైఖ‌రిని త‌ప్పు ప‌డుతున్నారు. పొరుగింటి పుల్ల కూర క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని రీమేక్ లు చేయ‌డాన్ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాడు. బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్, పెద్ద హీరోలు కూడా ద‌ర్శ‌కర‌చ‌యిత‌లు రాసుకున్న ఒరిజిన‌ల్ స్క్రిప్టుల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో అత‌డు మాట్లాడుతూ పుష్ప, మంజుమ్మ‌ల్ బోయ్స్ లాంటి సినిమాల‌ను బాలీవుడ్ లో ఎప్ప‌టికీ తీయ‌లేర‌ని కూడా విమ‌ర్శించాడు.

అత‌డు ఏ కోణంలో విమ‌ర్శిస్తున్నాడో కానీ పొరుగింటి పుల్ల‌కూర‌పై ఆధార‌ప‌డిన వ‌రుణ్ ధావ‌న్ లాంటి హీరోకి పెద్ద పంచ్ ప‌డింది. అత‌డు న‌టించిన తాజా చిత్రం 'బేబి జాన్' పెద్ద ఫ్లాపైంది. ఈ సినిమా 160కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తే, కేవ‌లం 34 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఒక్క సినిమాతో వ‌రుణ్ ధావ‌న్ ఆశ‌ల‌న్నీ ఆవిరైపోయాయి. ఇది త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ తేరికి రీమేక్. వ‌రుణ్ ధావ‌న్ ఒరిజిన‌ల్ స్క్రిప్టును న‌మ్ముకుని ఉంటే ఇలాంటి ప‌రిస్థితి ఉండేది కాదేమో!

అయినా బాలీవుడ్ లో రీమేక్ లు ఆగ‌డం లేదు. ఇంత‌కుముందు నాని న‌టించిన 'జెర్సీ' చిత్రాన్ని షాహిద్ హిందీలో రీమేక్ చేసి పెద్ద దెబ్బ తిన్నాడు. ఇప్ప‌టికీ అత‌డు మార‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడు కూడా మ‌రో రీమేక్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇది ఈ నెల జనవరి 31న విడుదలవుతోంది. 2013 మ‌ల‌యాళ క‌ల్ట్ చిత్రం ముంబై పోలీస్ ని షాహిద్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కించారు. తాజాగా అత‌డి ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. షాహిద్ మరోసారి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ర‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు ఈ గెట‌ప్‌లో. నోటిలో బీడీ.. గార ప‌ట్టిన ప‌ళ్లు.. బాల్డ్ హెడ్.. తెల్ల చొక్కాతో మాసీగా ఇంటెన్స్ గా క‌నిపిస్తున్నాడు పోస్ట‌ర్ లో. దానికి త‌గ్గ‌ట్టే హార్డ్ హిట్టింగ్ యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. అయితే ఇది బేబి జాన్, జెర్సీ త‌ర‌హాలో మ‌రో ఫెయిల్యూర్ కాకూడ‌ద‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ చిత్రానికి ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. పోస్ట‌ర్ చూడ‌గానే అమితాబ్ క్లాసిక్ డే లుక్‌ని గుర్తు చేస్తున్నాడంటూ ప్రశంస‌లు కురిపిస్తున్నారు. పోస్ట‌ర్ కి పాజిటివ్ టాక్ వ‌చ్చింది గ‌నుక షాహిద్ పెర్ఫామెన్స్ వ‌ర్క‌వుటైతే ఈ సినిమా మంచి వ‌సూళ్లను సాధించే అవ‌కాశం ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ తో పెద్ద హిట్టు కొట్టిన షాహిద్ చాలా కాలంగా అలాంటి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. క‌నీసం దేవా తో అయినా అది పాజిబుల్ అవుతుందేమో చూడాలి.