Begin typing your search above and press return to search.

మ‌రో లెజెండ‌రీ గాయుకుడి జీవితం తెర‌పైకి!

సుమారు 5 వేలకు పైగా పాటలు.. అందులో ఎన్నో ప్రేమ గీతాలు, భక్తిరస మధురాలు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 6:44 AM GMT
మ‌రో లెజెండ‌రీ గాయుకుడి  జీవితం తెర‌పైకి!
X

భారతదేశం గర్వించదగిన దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీ. ఆయన పాట ఓ మధురం. గానగంధర్వుడిగా పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. రఫీ పాటంటే ఎంతో ఆస్వాదించారు. మ‌రెంత‌గానో ప్రేమించేవారు. గాయ‌కుడిగా అత‌డి ప్ర‌భావం ఎంతో ఉంది. అంతటి గొప్ప గాయకుడు రఫీ. ఆయనకు ఏ బిరుదు ఇచ్చినా తక్కువే. బతికినంతకాలం, చివరి శ్వాస వరకు పాడుతూనే బతికిన వ్యక్తి మహమ్మద్ రఫీ. సుమారు 5 వేలకు పైగా పాటలు.. అందులో ఎన్నో ప్రేమ గీతాలు, భక్తిరస మధురాలు.


1000కి పైగా చిత్రాల్లో పాట‌లు పాడారు. మొత్తంగా ఆయ‌న కెరీర్ లో 5000ల‌కు పైగా పాట‌లు పాడి త‌న గాత్రంతో కోట్లాది మంది శ్రోత‌ల్ని అల‌రించిన లెజెండ్ ఆయ‌న‌. తాజాగా మ‌హ్మ‌ద్ ర‌ఫీ జీవిత క‌థ‌ను తెర‌పైకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న కుమారుడు షాహిద్ ర‌ఫీ గోవా వేదిక‌గా ప్ర‌క‌టించారు. `నాన్న జీవితాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి `ఓ మైగాడ్` ఫేం ద‌ర్శ‌కుడు ఉమేష్ శుక్లాతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం.

ఇది పూర్తి స్తాయి ఫీచ‌ర్ పిల్మ్ గా రాబోతుంది. ఇందులో ఆయ‌న పాడిన పాట‌లు కూడా ఉంటాయి. దీన్ని ఆయ‌న శ‌త జ‌యంతి సంద‌ర్భంగా వ‌చ్చే నెల‌లో అధికారికంగా ప్ర‌క‌టిస్తాం. మ‌రి మ‌హ్మ‌ద్ ర‌ఫీ పాత్ర ఏ న‌టుడు పోషిస్తాడు? అన్న‌ది చూడాలి. ఎవ‌రు పోషించినా? గొప్ప గాయ‌కుడి జీవితంలో న‌టించే అవకాశం రావ‌డం మాత్రం అదృష్ట‌మ‌నే చెప్పాలి. అలాగే ఈ సినిమాకు సంగీతం అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది.

వేల పాట‌లు పాడిన లెజెండ్ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కి వ‌స్తుందో చూడాలి. సినిమాల్లో గాయ‌కుడిగా ర‌ఫీ ఎదిగిన విధానం..ఇండ‌స్ట్రీకి రాక‌ముందు అత‌డి నేప‌థ్యం...జీవిత విశేషాలు వీట‌న్నింటి ఈ సినిమాలో చూపించ‌నున్నారు.