ఛత్రపతి శివాజీగా ఆస్టార్ హీరో!
కానీ అది సాధ్యపడలేదు. చర్చల దశలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా షాహిద్ కపూర్ తెరపైకి వచ్చాడు.
By: Tupaki Desk | 5 Feb 2024 10:30 AM GMTవెండి తెరపై మరాఠా యోధుడు.. అఖండ హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారం గా కొన్నిటీవీరిసీస్లు..సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అమోల్ కోల్హే వివిధ టీవీ షోలలో శివాజీ మహారాజ్ పాత్రతో మంచి పేరు దక్కించుకున్నారు. 'రాజా శివఛత్రపతి'..' స్వరాజ్య జననీ జీజామాత'.. 'స్వరాజ్య సౌదామిని' ..'తారారాణి' వంటి షోలలో శివాజీ మహారాజ్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు.
సచిన్ ఖేడేకర్..మహేష్ మంజ్రేకర్.. శంతను మోఘే లాంటి వారు శివాజీ పాత్రలో కనిపించారు.'తానాజీ' సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రకు ప్రాధాన్యం ఉన్నా..పూర్తి స్థాయిలో మాత్రం శివాజీ సినిమా ను తెరకెక్కించలేకపోయారు. తెలుగులో కూడా అక్కినేని హీరోగా నటించిన 'భక్త తుకారాం' వంటి సినిమా ల్లో శివాజీ పాత్ర కనబడుతోంది. అలా శివాజీ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎవరూ తెరకెక్కిచలేదు.
దీంతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ 'సైరత్' ఫేమ్ నాగరాజ్ మంజులే శివాజీని కథను భారీ ఎత్తున ప్లాన్ చేసాడు. మొదటి భాగాన్ని 'శివాజీ'గా.. రెండో భాగాన్ని 'రాజా శివాజీ'గా.. మూడో భాగాన్ని 'ఛత్రపతి శివాజీ' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేసారు. పాన్ ఇండియాలో ఈ చిత్రాల్ని తీసుకురావాలని పెద్ద ప్లానింగ్ వేసారు. కానీ అది సాధ్యపడలేదు. చర్చల దశలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా షాహిద్ కపూర్ తెరపైకి వచ్చాడు.
దర్శకుడు అమిత్ రాయ్-షాహిద్ కపూర్ శివాజీ జీవితాన్ని పూర్తి స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇప్పటికే ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా సాగుతుందని సమాచారం. వకావో పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అశ్విన్ నిర్మించడానికి ముందుకొస్తున్నారుట. సినిమాకి సంబంధించిన వివరా లు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం. శివాజీ పాత్రకు షాహిద్ అయితే పర్పెక్ట్ గా సూటవుతున్నాడని అమిత్ బలంగా విశ్వషిస్తున్నాడుట. షాహిద్ కపూర్ కంటే కొంత మంది నటుల్నీ పరిశీలిచినప్పటికీ వాళ్లకంటే షాహిద్ అయితేనే బాగుంటుందని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.