Begin typing your search above and press return to search.

SRK మన్నత్ వ‌దిలి వెళ్ళిపోతున్నాడా?

కొన్నిసార్లు నిజం ఏదో అబ‌ద్ధం ఏదో అర్థం కాదు. ఎల్ల‌పుడూ అస‌త్యం దూకుడుగా వైర‌ల్ అయిపోతుంది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 12:29 AM IST
SRK మన్నత్ వ‌దిలి వెళ్ళిపోతున్నాడా?
X

కొన్నిసార్లు నిజం ఏదో అబ‌ద్ధం ఏదో అర్థం కాదు. ఎల్ల‌పుడూ అస‌త్యం దూకుడుగా వైర‌ల్ అయిపోతుంది. అలాంటి ఒక పుకార్ 7,300 కోట్ల నిక‌ర ఆస్తుల‌తో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ ధ‌నిక స్టార్ గా వెలిగిపోతున్న షారూఖ్ అత‌డి కుటుబంపైనా షికార్ చేసింది. కింగ్ ఖాన్ షారూఖ్ త‌న భార్య గౌరీఖాన్, కుమారుడు కుమార్తెతో క‌లిసి మ‌న్న‌త్ (సొంత ఇల్లు) వ‌దిలి అద్దె ఇంట్లోకి వెళ్లిపోతున్నార‌ని పుకార్ మొద‌లైంది.

ఒక్క క్ష‌ణం ఈ వార్త‌ అంద‌రినీ షాక్ కి గురి చేసింది. షారూఖ్‌ అంతటి ఆస్తిమంతుడు స్థితిమంతుడు ఎందుకు సొంత ఇల్లు వ‌దిలేస్తాడు? అన్న డైల‌మా నెల‌కొంది. మ‌న్న‌త్ ని వ‌దిలి షారూఖ్ వెళ్లిపొమ్మ‌న‌డం అంటే చుక్క‌ల్ని వ‌దిలి చంద్రుడిని వెళ్లిపోమ‌న‌డ‌మే! ముంబై న‌గ‌రంలో మన్నత్ కేవలం ఒక ఇల్లు కాదు.. ఇది ఒక స్మారక చిహ్నం.. ఒక దేవాల‌యం.. అభిమానుల ఊహల్లోని అంద‌మైన‌ కల. కాబట్టి షారుఖ్ ఖాన్ మన్నత్‌ను విడిచిపెడుతున్నట్లు గుసగుసలు సోషల్ మీడియాలో వైర‌ల్ కాగానే..అభిమానులు కించిత్ క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. లీక్డ్ ట్రైల‌ర్ లాగా ఊహాగానాలు వ్యాపించాయి. ముంబై సీఫేసింగ్ లో ఇలాంటి అంద‌మైన భ‌వంతి నుంచి ఖాన్ వెళ్లిపోవ‌డ‌మా?

కింగ్ మ‌న్న‌త్ ని వ‌దిలేస్తాడు! అన‌గానే అభిమానులను ఎక్కువగా బాధపెట్టినది ఏమిటంటే.. షారుఖ్ తన బాల్కనీలో అభిమానులను అలరించడానికి అడుగుపెట్టినప్పుడు ఆ ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ ఫోజ్.. ఫ్రైడే మూవ్ మెంట్ ని కోల్పోతామ‌నే ఆవేద‌న‌... ఖాన్ చాలా సంవత్సరాలుగా ఫ్రైడే ఫ్యాన్స్ మీట్ ఆచారాన్ని కొన‌సాగించేది మ‌న్న‌త్ వ‌ద్ద‌నే..!

అయితే ఇవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలు.. కేవ‌లం క్రియేటివిటీ.. అంటూ ఖండించారు ఖాన్ స‌న్నిహితులు. అతడికి `మన్నత్` వదిలి వెళ్ళే ఉద్దేశ్యం లేదని నిర్ధారించారు. డిడిఎల్‌జే రైలు సన్నివేశం లేదా `మై నేమ్ ఈజ్ ఖాన్` ఐకానిక్ ``మై నేమ్ ఈజ్ ఖాన్ అండ్ ఐయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్`` డైలాగ్ లాగా అతడి జీవిత కథలో భాగమైన `మన్నత్` ఇంటిని వదిలి వెళ్ళే ఉద్దేశ్యం ఎప్ప‌టికీ లేనే లేదని తేలింది. మొత్తానికి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. హ‌మ్మ‌య్య‌!!