Begin typing your search above and press return to search.

2025 లో మూడు సినిమాలతో ఆ స్టార్ హీరో బ‌రిలోకి!

తాజాగా షారుక్ స‌ర‌ళి చూస్తుంటే మ‌ళ్లీ 2025లో ఇదే స‌న్నివేశం రిపీట్ చేసేలా క‌నిపిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 8:30 AM GMT
2025 లో మూడు సినిమాలతో ఆ స్టార్ హీరో బ‌రిలోకి!
X

బాద్ షా షారుక్ ఖాన్ గ‌తేడాది వ‌రుస‌గా హిట్ సినిమాల‌తో బాక్సాఫీస్ ని హోరెత్తించాడు. ప‌ఠాన్, జ‌వాన్ , డుంకీ వియాల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. మూడు సినిమాలు 2000 కోట్ల వ‌సూళ్ల‌ను తెచ్చిపెట్టాయి. ఇలా మూడు విజ‌యాలు అందుకున్నాడు? అంటే అంత‌కు ముందు 2022లో పూర్తిగా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ ల‌పైనే వ‌ర్క్ చేయ‌డంతోనే సాధ్య‌మైంది. తాజాగా షారుక్ స‌ర‌ళి చూస్తుంటే మ‌ళ్లీ 2025లో ఇదే స‌న్నివేశం రిపీట్ చేసేలా క‌నిపిస్తున్నాడు.

2024లో ఇంత‌వ‌ర‌కూ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేదు. అస‌లు క‌మిట్ అయిన దాఖ‌లాలేవు. పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి జారుకున్నాడు. క‌థ‌లు విన‌డం...సొంత నిర్మాణ సంస్థ‌లో అప్ డేట్స్ చూసుకోవ‌డం తప్ప ఈ ఏడాది షారుక్ ఖాన్ చేసిందేం లేదు. అయితే 2025 లో మాత్రం సాలిడ్ గానే ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే స్త్రీ-2తో భారీ విజ‌యం అందుకున్న ద‌ర్శ‌కుడు అమ‌ర్ కౌశిక్ తో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నాడు.

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎలాంటి సినిమా వ‌స్తుంద‌న్న‌ది తెలియ‌దు గానీ.. ఇద్ద‌రు స‌క్స‌స్ త‌ర్వాత చేసే సినిమా కాబ‌ట్టి అంచ‌నాలు పీక్స్ లో ఉంటాయి. అలాగే మ‌రో రెండు సినిమాలు ఫైన‌ల్ అవ్వాల్సి ఉంది. ఇప్ప‌టికే షారుక్ ఖాన్ చాలా క‌థ‌లు విన్నాడు. కానీ వేటిని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అలాగే ఆ ద‌ర్శ‌కుల వివ‌రాలు కూడా గోప్యంగానే ఉన్నాయి.

అయితే ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌ర‌క‌ల్లా ఆ రెండు సినిమా వివ‌రాలు కూడా బాద్ షా ప్ర‌క‌టిస్తార‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. వాటిలో రెండు చిత్రాలు ఒకేసారి సెట్స్ కి తీసుకెళ్లాలా షారుక్ ఖాన్ ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారుట‌. అంటే బాద్ షా 2025 లో కూడా 2023 స‌న్నివేశాన్నే రిపీట్ చేసేలా రెడీ అవ‌తున్నారన్న మాట‌.