Begin typing your search above and press return to search.

షారూఖ్‌-సుహానా మూవీ లాంచ్- రిలీజ్ తేదీ?

కుమార్తె సుహానా ఖాన్ న‌టిస్తున్న తొలి పెద్ద సినిమాలో షారూఖ్ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించ‌నున్నార‌ని, సుహానాకు అత‌డు ర‌క్ష‌కుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్ వినిపించింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 3:00 AM GMT
షారూఖ్‌-సుహానా మూవీ లాంచ్- రిలీజ్ తేదీ?
X

ఏడాది కాలంగా షారూఖ్‌-సుహానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించే సినిమా 'కింగ్' గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కుమార్తె సుహానా ఖాన్ న‌టిస్తున్న తొలి పెద్ద సినిమాలో షారూఖ్ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించ‌నున్నార‌ని, సుహానాకు అత‌డు ర‌క్ష‌కుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్ వినిపించింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిద్ధార్థ్ ఆనంద్ - మమతా ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించ‌నున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ లొ షారుఖ్ ఖాన్ అండర్ వరల్డ్‌లో గురువుగా క‌నిపిస్తుండ‌గా, అత‌డి ఆశ్రితురాలిగా సుహానా న‌టిస్తోంది. అభిషేక్ బచ్చన్ ప్రతినాయకుడిగా క‌నిపిస్తాడ‌ని టాక్ ఉంది.

ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అవుతోంది. అదే స‌మయంలో ఇత‌ర‌ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్వింగ్‌లో జరుగుతున్నాయి. షారూఖ్ ఖాన్ - సిద్ధార్థ్ ఆనంద్ ఇప్ప‌టికే కింగ్ షూటింగ్ టైమ్‌లైన్‌లను లాక్ చేశారని తెలుస్తోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ''కింగ్ చిత్రం జనవరి నుండి ముంబైలో సెట్స్ పైకి వెళుతుంది. మొదటి షెడ్యూల్ తరువాత యూరప్‌లో మారథాన్ షెడ్యూల్ ఉంటుంది. కింగ్ స్థాయిని ఎలివేట్ చేసే అరుదైన లొకేషన్‌లను గుర్తించేందుకు మేకర్స్ యూరప్‌లో పలు రౌండ్‌లు రెక్కీ చేశారు'' అని తెలిసింది.

షెడ్యూల్‌ ప్రకారం.. నటీనటులు ఒక లొకేషన్ నుండి మరొక లొకేషన్‌కు మారవలసి ఉంటుంది కాబట్టి.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు చిత్రీకర‌ణ‌లో ఉంటుంద‌ని తెలిసింది. యాక్షన్‌ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడంతోపాటు స్టూడియో సెటప్ లో చిత్రీక‌రించ‌డం.. స్టోరీ-టెల్లింగ్ ప్యాట్రన్‌కి సరైన రియలిజమ్‌ని తీసుకురావాలనే ఆలోచన మేక‌ర్స్ లో ఉంది. కింగ్‌లో షారుఖ్ ఖాన్ రొటీన్ కి భిన్నంగా పూర్తిగా కొత్త తరహా యాక్షన్ తో ర‌క్తి క‌ట్టించేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సూపర్‌స్టార్ షారూఖ్ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.. అని తెలిసింది. ఈద్ 2026 విడుదల లక్ష్యంగా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తార‌ని స‌మాచారం. ఈద్ రోజున షారుఖ్ ఖాన్ సినిమా విడుదలై కొన్నేళ్ల‌యింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ చారిత్రాత్మక విజయం తర్వాత అతడు ఈద్ పండుగకు తిరిగి వ‌చ్చే వీలుంది. ప్రస్తుతం షూటింగును అనుకున్న‌ట్టు పూర్తి చేస్తే.. మేకర్స్ ఈద్ 2026 విడుదల స్లాట్‌కు చేరుకుంటారు అని చెబుతున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ- మా బ్యాన‌ర్ మార్ఫ్లిక్స్ రెండేళ్లలో 8 సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతోంది. వీటిలో కింగ్ సినిమాతో పాటు సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లావత్‌లతో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించ‌నున్న‌ జ్యువెల్ థీఫ్, హృతిక్ రోషన్ సూపర్ హీరో ఫ్రాంచైజీ `క్రిష్ 4` .... సిద్ AD, రోహన్ ఖంబాటి యాక్షన్ చిత్రం, శ్రీశ్రీ రవిశంకర్ జీవితంపై అంతర్జాతీయ చలనచిత్రం, మహిళా ప్రధాన యాక్షన్ చిత్రం సెట్స్ పైకి వెళ‌తాయి. అలాగే భారీ యాక్ష‌న్ హీరోల‌తో స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీని తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న సిద్ధార్థ్ ఆనంద్ కి ఉంది. భారతదేశంలో రాంబోని రీమేక్ చేసే హక్కులు కూడా అతడి వ‌ద్ద‌ ఉన్నాయి. మరోవైపు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రచన దశలో ఉన్న YRF స్పై యూనివర్స్ ఫిల్మ్- పఠాన్ 2లో న‌టించాల్సి ఉంది.