బన్నీని కలుస్తానన్న షారుక్!
ఈ నేపథ్యంలో షారుక్ రిప్లై ఇవ్వడంతో..ఇద్దరు ఎంత మంచి స్నేహితులు అన్నది మరోసారి ప్రూవ్ అయింది
By: Tupaki Desk | 14 Sep 2023 11:49 AM GMT'జవాన్' విజయంతో షారుక్ ఖాన్ ఆనందానికి అవదుల్లేవ్. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. 'పఠాన్' తర్వాత వెను వెంటనే దక్కిన భారీ సక్సెస్. ఇదంతా ఒక ఎత్తైతే ఈసినిమాకి తెలుగు పరిశ్రమ నుంచి మంచి స్పందన వస్తోంది. మన సెలబ్రిటీలు సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సినిమా చూసి ప్రశంసించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో షారుక్ రిప్లై ఇవ్వడంతో..ఇద్దరు ఎంత మంచి స్నేహితులు అన్నది మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'జవాన్' పై ప్రశంసలు కురిపించారు. 'మీ కెరీర్ లో ఇది అత్యుత్తమ చిత్రం. మీ స్టైల్ తో భారతదేశం మొత్తాన్ని ఉర్రూతలూగించారు. మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చూడాలని కోరుకుంటున్నా. ఇక విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు.
దీపిక..నయనతార తమ అందంతో మెరిసారు. అనిరుద్ తన సంగీతంతో మైమరిపించారు. అట్లీ కమర్శియల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం' అని రాసుకొచ్చారు. దీనికి షారుక్ బధులిచ్చిన విధానం ఆశ్చర్య పరిచింది. 'మాటల్లో చెప్పలేనంత ఆనందం కల్గుతుంది. మీరు నాపై చూపించిన ప్రేమకు ఎంతో సంతోషం. మీ ట్వీట్ తో జవాన్ విజయాన్ని రెండవసారి ఆస్వాదిస్తున్నా.
మీరు నటించిన 'పుష్ప' సినిమాని మూడు రోజుల్లో మూడు సార్లు చూసాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీలైనంత త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి నా ప్రేమని తెలియజేస్తాను. లవ్ యూ అని షారుక్ ట్వీట్ చేసారు. షారుక్ ఇలా వరుసగా తెలుగు నటులపై అభిమానం కురిపించడం ఆసక్తికరం. ఇప్పటివరకూ షారుక్ ఏనాడు తెలుగు నటుల్ని ఉద్దేశించి మాట్లాడింది లేదు. ఇటీవల మహేష్ తో చాటింగ్..తాజాగా బన్నీతో చాటింగ్ చూస్తుంటే టాలీవుడ్ పై భారీగానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోవడానికి షారుక్ దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.