Begin typing your search above and press return to search.

పూట భోజ‌నం..తెల్లారి 5కి నిద్రపోయే ఏకైక స్టార్!

ఆయ‌న ఎవ‌రి వ‌ద్ద ఎలాంటి స‌ల‌హాలు తీసుకోరు. త‌న‌కంటూ సొంత ప్లానింగ్స్ ఉంటాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2024 1:30 PM GMT
పూట భోజ‌నం..తెల్లారి 5కి నిద్రపోయే ఏకైక స్టార్!
X

సెల‌బ్రిటీలంటే వాళ్ల‌కంటూ స‌ప‌రేట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఫిట్ నెస్..ఆరోగ్యం విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఉద‌యాన్నే యోగా, జిమ్ చేయ‌డం వంటివి త‌ప్ప‌నిస‌రి. అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అన్ని ఎంతో మితంగా తీసుకుంటారు. న్యూట్రీషియ‌న్లు...డైటీష‌య‌న్ల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తూ ముందుకెళ్తుంటారు. కానీ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తీరు మాత్రం వేరు.


ఆయ‌న ఎవ‌రి వ‌ద్ద ఎలాంటి స‌ల‌హాలు తీసుకోరు. త‌న‌కంటూ సొంత ప్లానింగ్స్ ఉంటాయి. ప్ర‌త్యేకంగా తానే ఓ ప్ర‌ణాళిక వేసుకుని ముందుకెళ్తుంటారు. అందుకే షారుక్ ఖాన్ ఇప్ప‌టికీ 30 ఏళ్ల యువ‌కుడిగా క‌నిపిస్తుం టాడు. ఈ హీరో కేవ‌లం రోజులో ఒక్క పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తారుట‌. ఉద‌యం, రాత్రి బురువైన ఆహారం తీసుకోరుట‌. వీలైనంత వ‌ర‌కూ తేలిక పాటి ఆహారం పండ్లు, డ్రైప్రూట్స్ లాంటివి తీసుకుంటారుట‌.

ఇక ఉద‌యం షారుక్ ఖాన్ బ్రేక్ ఫాస్ట్ లాంటివి చేయ‌రు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఘాడ‌మైన నిద్ర‌లో ఉంటారు. అవును తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కు ప‌డుకుంటారుట‌. అటుపై 10 గంట‌ల‌కు నిద్ర పోతారుట‌. మిగ‌తా స‌మ‌యమంతా ఏదో ప‌నిలో బిజీగా ఉంటారుట‌. అంటే షారుక్ డేలో ప‌డుకునేది కేవ‌లం 5 గంటలు మాత్ర‌మే. 10కి లేచిన త‌ర్వాత జిమ్ లో కొంత స‌మ‌యం గ‌డిపి స్నానం చేసి మ‌ళ్లీ ప‌నిలో నిమ‌గ్న‌మ‌వుతారుట‌. నేరుగా మ‌ధ్నాహ్నాం భోజ‌నం రైస్ తీసుకుంటారుట‌.

ఆ స‌మ‌యంలో మాత్రం క‌డుపు ప‌ట్టినంత తింటాడుట‌. మొత్తానికి షారుక్ ఖాన్ తిండి విష‌యంలో యోగి అని తెలుస్తోంది. ఒక‌పూట తింటే యోగి...రెండు పూట‌లు తింటే భోగీ, ...మూడు పూట‌లు తింటే రోగీ అన్న‌ట్లు! షారుక్ రూల్ నెంబ‌ర్ వ‌న్ పాటిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.