Begin typing your search above and press return to search.

బన్నీ స్వాగ్ ను నిజంగానే షారుక్ మ్యాచ్ చేయలేరా?

చెప్పాలంటే నేషనల్ వైడ్ గా సినీ ప్రియులకు ఓ రేంజ్ లో నచ్చేశాయి.

By:  Tupaki Desk   |   1 Oct 2024 1:41 PM GMT
బన్నీ స్వాగ్ ను నిజంగానే షారుక్ మ్యాచ్ చేయలేరా?
X

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై మూడేళ్లు దాటినా క్రేజ్ అస్సలు తగ్గలేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో బన్నీ యాక్షన్, డైలాగులు, స్టెప్పులతో పాటు స్వాగ్ కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలంటే నేషనల్ వైడ్ గా సినీ ప్రియులకు ఓ రేంజ్ లో నచ్చేశాయి. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా బన్నీ స్వాగ్ కు ఫిదా అయ్యారు.

పుష్ప మూవీకి గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ కూడా రావడంతో నేషనల్ లెవెల్ లో పేరు మార్మోగింది. అదే సమయంలో పుష్ప సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మేకర్స్ కూడా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. నిజానికి.. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా.. సినిమాను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. దీంతో సినీ ప్రియులతోపాటు ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. అల్లు అర్జున్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అబుదాబి వేదికగా ఇటీవల జరిగిన ఐఫా 2024 వేడుకల్లో బన్నీ గురించి షారుక్ గొప్పగా మాట్లాడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో వేడుకను కాసేపు హోస్ట్ చేస్తూ.. అల్లు అర్జున్ స్వాగ్‌ ను మ్యాచ్ చేయడం మన వాళ్ల కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దానికి విక్కీ కూడా అవును.. తాను కూడా చాలా సార్లు ట్రై చేశానని, కానీ తన వల్ల కాలేదని సరదాగా అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావాకు స్టెప్పులేశారు. ప్రస్తుతం షారుక్, విక్కీ మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బన్నీను బాలీవుడ్ బాద్ షా మెచ్చుకోవడం గ్రేట్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో కొందరు షారుక్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు.

పుష్ప స్వాగ్ ను మ్యాచ్ చేయడం షారుక్ కు కాస్త కష్టంలాగే అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ వైబ్స్ ను క్రియేట్ చేయడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అలా అని షారుక్ టాలెంట్ ఏం తక్కువ కాదనే చెప్పాలి. బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. వరుస సినిమాలతో అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. మరి షారుక్ వ్యాఖ్యలపై బన్నీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.