Begin typing your search above and press return to search.

అవార్డుల వేదిక‌పైనా కొడుకు ప‌రాభ‌వాన్ని త‌ల‌చిన సూప‌ర్‌స్టార్

అయితే దానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. అది త‌న వార‌సుడు ఆర్య‌న్ ప‌రాభ‌వ అనుభ‌వం!

By:  Tupaki Desk   |   29 Sep 2024 2:17 PM GMT
అవార్డుల వేదిక‌పైనా కొడుకు ప‌రాభ‌వాన్ని త‌ల‌చిన సూప‌ర్‌స్టార్
X

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) 2024 రెండవ రోజున అబుదాబి వేడుక‌ల్లో కింగ్ ఖాన్ షారూఖ్ ఎంతో ఉత్సాహంగా క‌నిపించాడు. తన చిత్రం `జవాన్`లో న‌ట‌నకు గాను ఉత్తమ నటుడి పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేదిక‌పై అత‌డు ఎమోష‌న‌ల్ గాను క‌నిపించ‌డం అంద‌ర‌నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే దానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. అది త‌న వార‌సుడు ఆర్య‌న్ ప‌రాభ‌వ అనుభ‌వం!

ఐఫా వేదిక‌పై సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు మణిరత్నం ఈ అవార్డును సూపర్‌స్టార్‌కు అందజేశారు. ట్వ‌ల్త్ ఫెయిల్‌కి విక్రాంత్ మాస్సే, యానిమల్‌కి రణబీర్ కపూర్, రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీకి రణవీర్ సింగ్, సామ్ బహదూర్ కోసం విక్కీ కౌశల్, గదర్ 2 కోసం సన్నీ డియోల్ నామినేష‌న్ల‌లో ఉన్నారు. కానీ అవార్డు కింగ్ ఖాన్ ని వ‌రించింది. త‌న స‌హ‌చ‌ర న‌టులంద‌ర‌కీ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. ``అందరూ చాలా గొప్పవారని నేను భావిస్తున్నాను. కానీ నేను చాలా కాలం తర్వాత స‌రిగా పనిచేసినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నందున నేను ఒక ఎడ్జ్‌ని పొందాను`` అని అన్నారు. ఇలాంటి వేదిక‌పై వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడ‌టం ఇష్టం ఉండ‌దు. ఎన్నో ఒత్తిళ్ల న‌డుమ జ‌వాన్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసాను అని షారూఖ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. జవాన్ (ఆర్యన్ ఖాన్ కేసును ప్రస్తావిస్తూ) చేస్తున్నప్పుడు మేము చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాము.. అని అన్నారు. అత‌డు త‌న‌ ప్రసంగంలో ఆర్యన్ ఖాన్ కేసును ప‌రోక్షంగా ప్రస్తావించార‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

2021 అక్టోబ‌ర్ ప్రారంభంలో ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ బాండ్‌పై విడుదల కావడానికి నాలుగు వారాలు ప‌ట్టింది. అనేకసార్లు కోర్టుకు హాజరవ్వాల్సి వ‌చ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎనిమిది నెలల తర్వాత మాదక ద్రవ్యాల కేసులో ఆర్య‌న్ కి ఎలాంటి సంబంధం లేద‌ని క్లీన్ చిట్ ఇచ్చింది.

ఐఫా వేదిక‌పై ఖాన్ మాట్లాడిన‌ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షారూఖ్ ఖాన్ అభిమానులు, అనుచరులు ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. అవార్డుల వేదిక‌పై మణిరత్నం పాదాలను తాకి, రెహమాన్ #SRKని కౌగిలించుకున్న తర్వాత సంప్రదాయాలను గౌరవించడం ద్వారా మరోసారి తన వినయాన్ని కింగ్ ఖాన్ చాటుకున్నారు అని ఒక‌రు ప్ర‌శంసించ‌గా, కఠినమైన సమయంలో అంటే.. తన కొడుకు డ్రగ్ కేసు అని అర్థం! అంటూ మ‌రొక‌రు విశ్లేషించారు.

ఐఫా 2024లో అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు, ఈ ఏడాది అవార్డుల కార్యక్రమానికి షారూఖ్ హోస్ట్‌గా వ్యవహరించారు. మ‌రో స్టార్ హీరో విక్కీ కౌశల్ తో పాటు షారూఖ్‌ వంతులవారీగా హోస్టింగ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. SRK , విక్కీ తౌబా తౌబా, ఊ అంటావా వంటి అనేక ట్యూన్‌లకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వేదిక‌పై కరణ్ జోహార్ కూడా వారితో జతకట్టారు. ఈ ముగ్గురూ పఠాన్ ఝూమ్ జో పఠాన్‌కు డ్యాన్సులు చేసారు.