Begin typing your search above and press return to search.

దుకాణం మీ ఇంట్లోనా? మా ఇంట్లోనా?

తాజాగా షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన 'జ‌వాన్' చిత్రంలోని 'జిందా బందా' పాట‌కు మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్ స్టెప్పులేసిన వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 April 2024 8:29 AM GMT
దుకాణం మీ ఇంట్లోనా?  మా ఇంట్లోనా?
X

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు భాష‌ల మ‌ధ్య అంత‌రం పూర్తిగా చెరిగిపోయింది. స్టార్లు అంతా ఒక్క‌టేన‌ని ప్రూవ్ చేస్తున్నారు. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటున్నారు. క‌లిసి మెలిసి ప‌నిచేయ‌డానికి సిద్దంగా ఉంటున్నారు. ఇదంతా పాన్ ఇండియా మార్కెట్ తెచ్చిన మార్పు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా షారుక్ ఖాన్ హీరోగా న‌టించిన 'జ‌వాన్' చిత్రంలోని 'జిందా బందా' పాట‌కు మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్ స్టెప్పులేసిన వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

అందులో మోహ‌న్ లాల్ డాన్సు ఇర‌గ‌దీసారు. షారుక్ ఖాన్ కంటే గొప్ప‌గా డాన్స్ చేసారు. ఎంతో సింపుల్ గా స్టెప్పులేసిన వైనం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. దీంతో ఆ వీడియో చూసిన షారుక్ మంత్ర‌ ముగ్గుడైపోయారు.

ఆ వెంట‌నే షారుక్ లైన్ లోకి వ‌చ్చి 'ఈ పాట‌కు స్టెప్పులేసి న‌న్ను ప్ర‌త్యేకంగా నిలిపినందుకు మోహ‌న్ లాల్ స‌ర్ కి కృత‌జ్ఞ‌త‌లు. మీరు చేసిన దాంట్లో నేనే స‌గ‌మే చేసాను. ల‌వ్ యూ స‌ర్ . మీతో క‌లిసి డిన్న‌ర్ చేసేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేసారు.

అందుకు మోహ‌న్ లాల్ బ‌ధులుగా...' డియ‌ర్ షారుక్ మీలా ఎవ‌రూ చేయ‌లేరు. మీ డాన్సులో ప్ర‌త్యేక‌మైన శైలి ఉంటుంది. మీ ప్ర‌శంస‌ల‌కు ధ‌న్య‌వాదాలు. కేవ‌లం డిన్న‌రేనా? మ‌న‌మెందుకు క‌లిసి జిందా బందా పాట‌కు డాన్సు చేయ‌కూడ‌దు? అని ట్వీట్ చేసారు. దాని షారుక్ స్పందిస్తూ డాన్సు మీఇంట్లోనా...మా ఇంట్లోనా?' మ‌రో ట్వీట్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైర‌ల్ గామారాయి. ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది.

షారుక్ ఖాన్ పాట‌కు మోహ‌న్ లాల్ డాన్సు చేయ‌డం ఇది తొలిసారి కాదు. గ‌తంలో షారుక్ ఖాన్ న‌టించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్స‌ లో లుంగి డాన్స్ పాట‌కు కూడా డాన్స్ చేసారు. ఆపాట‌లో మమ్ముట్టి కూడా భాగ‌మ‌య్యారు. ఇద్ద‌రు క‌లిసి డాన్సు చేసే స‌రికి అది సంచ‌ల‌నంగా మారింది అప్ప‌ట్లో. ఆ స‌న్నివేశం దుబాయ్ వేదిక‌గా చోటు చేసుకుంది.