ఆ స్టార్ హీరో 93 వరకూ రిటైర్మెంట్ లేదంటున్నాడే!
వరుస పరాజయాల తర్వాత షారుక్ ఖాన్ 'పఠాన్'..'జవాన్' విజయాలతో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలి సిందే
By: Tupaki Desk | 15 Feb 2024 11:30 AM GMTవరుస పరాజయాల తర్వాత షారుక్ ఖాన్ 'పఠాన్'..'జవాన్' విజయాలతో బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలి సిందే. అన్ని పరాజయాల్ని ఆ రెండు చిత్రాలు వసూళ్లతో బ్యాలెన్స్ చేసాయి. అటుపై రిలీజ్ అయిన 'డంకీ' కూడా యావరేజ్ గా ఆడటంతో షారుక్ గ్రాఫ్ మరింత మెరుగుపడింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆరుక్ ఖాతాలో హిట్ గా నమోదైన చిత్రాలవి. వరుస వైఫల్యాలతో విమర్శ లెదుర్కుంటోన్న ఇండస్ట్రీని షారుక్ విజయాలే మళ్లీ గతేడాది నెంబవర్ వన్ స్థానానికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది అంతే వాస్తవం.
అయితే తాజాగా ఈ ఐదేళ్ల విరామాన్ని ఉద్దేశించి షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ విరామం తనకెన్నో పాఠాలు నేర్పిందని అభిప్రాయపడ్డారు. 'వంటగదికి పరిమితమై పిజ్జాలు చేయడం మొదలు పెట్టాను. ఆ అనుభవం పట్టుదలకి విలువనిస్తుందని అర్దమైంది. పర్పెక్ట్ పిజ్జా తయారవ్వడానికి ఎంత ప్రాసస్ ఉంటుందో జీవితం కూడా అంతేనని తెలుసుకున్నా. ఏదీ అప్పటికప్పుడు తొందరపడిపోతే అవ్వదు. దేనికైనా సమయం రావాలి. అంతవరకూ వెయిట్ చేయడం...పనిచేసుకుంటూ వెళ్లడం తప్ప చేసేదేమి ఉండదు.
నా కుటుంబమంతా తిరిగా సినిమాలు చేయాలని ప్రోత్సహించింది. నాసినిమాలు ఏవైనా గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. శనివారం..ఆదివారం కూడా సినిమాలకు కలిసొస్తాయి. ఆ మూడు రోజులే సంతోషం ఉంటుంది. సోమవారం మళ్లీ తిరిగి కొత్త సినిమా ప్రారంభించాల్సిందే. నా దృష్టిలో సోమవారం ఎంతో ముఖ్యమైన రోజు. 'స్లమ్ డాగ్ మిలీయనీర్ 'కథ నా దగ్గరకు వచ్చే సరికి నేను కౌన్ బనేగా కరోడ్పతి కి హోస్ట్ గా ఉన్నాను.
ఆ సినిమాలో నా పాత్ర గురించి కొన్ని గంటలు పాటు దర్శకుడిగా చర్చించా. అందుకే తిరస్కరించాను. ఈసినిమా రంగంలో ఇంకా 35 ఏళ్ల పనిచేస్తాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని ఉంది. కానీ అక్కడ కథలు నా వరకూ రావడం లేదు. అవకాశం వస్తే తప్పకుండా వినియోగించుకుంటాను' అని అన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ వయసు 58 ఏళ్లు వాటికి మరో 35 ఏళ్లు కలిపితే 93 ఏళ్లు అవుతుంది. అంటే షారుక్ ఖాన్ 93 ఏళ్లు వచ్చే వరకూ సినిమాల నుంచి నిష్క్రమించేది లేదని తెలుస్తోంది.