Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ డుంకీ ప్రీబిజినెస్ సంచ‌ల‌నాలు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 2:45 PM GMT
షారుఖ్ ఖాన్ డుంకీ ప్రీబిజినెస్ సంచ‌ల‌నాలు
X

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఏడాది ఆరంభంలో ప‌ఠాన్ బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది. ఇటీవ‌లే విడుద‌లైన జ‌వాన్ సైతం సుమారు 600కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన `డుంకీ` విడుద‌ల‌ కోసం అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్‌లో క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. డుంకీతో ఖాన్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయమేనంటూ ఇప్ప‌టికే అభిమానులు సంబ‌రాల్లో మునిగి తేల్తున్నారు. అప‌జ‌యం ఎరుగ‌ని రాజ్ కుమార్ హిరాణీ కింగ్ ఖాన్ కి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందిస్తార‌ని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

డుంకీలో SRK - తాప్సీ పన్ను కాంబినేష‌న్ తో, కొత్త ఆన్-స్క్రీన్ జోడిని చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కొత్త జోడీ ఖాన్ అభిమానులు, ఔత్సాహికులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కొన్ని మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. డుంకీ OTT హక్కులను ఇప్పటికే జియో సినిమా సొంతం చేసుకుంది. కానీ Netflix భారీ మొత్తానికి కొనుగోలు చేసిందంటూ ఒక సెక్ష‌న్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. డుంకీ డిజిటల్ హక్కులను రికార్డు స్థాయిలో రూ.155 కోట్లకు జియో సినిమా కొనుగోలు చేసింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌నం ప్రకారం,..డుంకీ డిజిటల్ - శాటిలైట్ హక్కులు రెండూ రూ. 230 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ హక్కులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలువడుతున్నందున ఉత్కంఠ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో డుంకీ ఒకటి. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనిని రాజ్‌కుమార్ హిరానీ, గౌరీ ఖాన్, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్షోభ స‌మ‌యంలో విదేశాల‌లో స్థిర‌ప‌డి అక్క‌డి నుంచి తిరిగి వెన‌క్కి రావాల‌నుకునే భార‌తీయుల వెత‌ల నేప‌థ్యంలో ఈ సినిమా కథాంశం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది.