Begin typing your search above and press return to search.

ప్రభాస్ వచ్చిన కూడా తగ్గేదెలా అంటున్న సూపర్ స్టార్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వాయిదా పడింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 4:30 PM GMT
ప్రభాస్ వచ్చిన కూడా తగ్గేదెలా అంటున్న సూపర్ స్టార్!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉన్న అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదే రోజు హిందీలో షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో చేస్తోన్న డుంకీ మూవీ రిలీజ్ కాబోతోంది.

ఈ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేశారు. రాజ్ కుమార్ హిరాణీ అంటే సోషల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై సెటైరికల్ గా అతని చిత్రాలు చాలా వరకు ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని షారుఖ్ ఖాన్ తన ఖాతాలో వేసుకున్నారు.

అలాగే రెండు చిత్రాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెయ్యి కోట్లు ఒకే ఏడాదిలో కలెక్షన్స్ సాధించిన హీరోగా రికార్డు సృష్టించాడు. డుంకీ మూవీతో హ్యాట్రిక్ గ్యారెంటీ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చే సమయంలో ఇంకో పెద్ద మూవీ కాంపిటేషన్ గా వస్తే కచ్చితంగా కలెక్షన్స్ పైన ఆ ప్రభావం ఉంటుంది. రెండు చిత్రాలకి హిట్ టాక్ వచ్చిన మామూలు వచ్చే కలెక్షన్స్ కంటే ఎంతోకొంత డ్రాప్ ఉంటుంది.

అందుకే డిస్టిబ్యూటర్స్ మాత్రం ఈ రెండు చిత్రాల పోటీపై టెన్షన్ పడుతున్నారు. అయితే డుంకీ చిత్ర యూనిట్ మాత్రం అసలు సలార్ మూవీ పోటీ గురించి ఆలోచించడం లేదంట. సినిమా అవుట్ పుట్ కూడా సిద్ధం కావడంతో అనుకున్న డేట్ కి అనుకున్నట్లు రిలీజ్ చేయడం ఖాయం అని అంటున్నారు. సలార్ రిలీజ్ అయితే డుంకీ వాయిదా పడుతుందనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదనే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏ సినిమా పోటీలో ఉన్న కూడా డుంకీ రిలీజ్ కావడం ఖాయం అని, వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని బిటౌన్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ వరుస రెండు హిట్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఎంత చేసిన సౌత్ లో బాద్ షా మార్కెట్ తక్కువే. సలార్ కి అతి పెద్ద మార్కెట్ సౌత్ ఇండస్ట్రీ. కాబట్టి పోటీ పడిన పెద్దగా ఇబ్బంది ఉండదనే మాట కూడా ఓ వర్గం నుంచి వినిపిస్తోంది.