Begin typing your search above and press return to search.

మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ పై క‌న్నేసిన షారూఖ్‌

ప‌ఠాన్ తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించ‌కున్నాడు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:35 AM GMT
మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ పై క‌న్నేసిన షారూఖ్‌
X

ప‌ఠాన్ తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించ‌కున్నాడు. ఇప్పుడు ఆ స్థాయిని నిల‌బెట్టుకునేందుకు అసాధార‌ణ ప్ర‌ణాళిక‌తో వ‌స్తున్నాడు. ఒక సౌత్ దర్శ‌కుడితో ప‌ని చేయ‌డ‌మే గాక సౌత్ స్టార్ల‌కు స‌హాయ‌క పాత్ర‌ల్లో అవ‌కాశాలు ఇవ్వ‌డం ద్వారా ఇప్పుడు అత‌డు స‌రికొత్త బాక్సాఫీస్ స్పేస్ లోకి అడుగుపెడుతున్నాడు. మ‌రోసారి అత‌డు 1000 కోట్ల క్ల‌బ్ అందుకునేందుకు ఈ ప్లాన్ స‌హ‌క‌రిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు. ఈ గురువారం (7సెప్టెంబ‌ర్) జ‌వాన్ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇది ఓపెనింగుల రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. `జవాన్` చిత్రం ఖాన్ మూడు దశాబ్దాల కెరీర్‌లో అతిపెద్ద ఓపెనర్‌లలో ఒకటిగా నిలుస్తుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. తొలిసారి షారూఖ్ రొటీనిటీకి భిన్నంగా త‌న‌ని తాను తెర‌పై ఆవిష్క‌రించుకున్నాడు. ఇందులో మొదటిసారిగా బట్టతల‌తో క‌నిపిస్తున్నాడు. భారీ మాస్ యాక్ష‌న్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో క‌ట్టి ప‌డేస్తుంద‌ని చెబుతున్నారు.

మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద `పఠాన్` రూ. 57 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు `జవాన్` ఆ సంఖ్యను దాటవచ్చని ట్రేడ్ చెబుతోంది. విడుదల దగ్గర పడుతుండగా `జ‌వాన్` మొదటి రోజు వ‌సూళ్లు, ప్రారంభ వారాంతపు వ‌సూళ్ల గురించి ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. జ‌వాన్ హుషారు చూస్తుంటే మొద‌టి రోజు రూ. 75 కోట్ల నెట్ (హిందీ - తమిళంతో కలిపి) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ మేర‌కు ట్రేడ్ అనలిస్ట్ అక్షయ్ రాఠీ అంచనా వెలువ‌రించారు.

ప్ర‌ముఖ విశ్లేష‌కుడు రాఠీ ముచ్చ‌టిస్తూ..ఈ వారాంతంలో పవర్-ప్యాక్డ్ విడుదలతో దేశం నలుమూలల నుండి సినీ ఔత్సాహికులను థియేట‌ర్ల‌కు స్వాగతించడానికి జ‌వాన్ సిద్ధంగా ఉంది. ఇది యాక్షన్ డ్రామా థ్రిల్స్‌తో కూడిన అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన తారాగణం, దర్శకుడు అట్లీ కుమార్ అద్భుతమైన కథా నైపుణ్యం, అనిరుధ్ రవిచందర్ మంత్రముగ్ధులను చేసే సంగీత స్వరకల్పనల కారణంగా జవాన్ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ వైవిధ్యమైన పాత్ర‌ల‌తో అల‌రించ‌నున్నారు. నిజానికి జవాన్ టీజర్ విడుదలైనప్పటి నుండి గొప్ప‌ బజ్‌ని సృష్టించింది. ఓపెనింగులు అదిరాయి. ఇప్పటికే బుక్‌మైషోలో భారీ 7,50,000 టిక్కెట్లు బుక్ అయ్యాయి. ముందస్తు బుకింగ్‌లతో ప‌లు నగరాల్లో ఈ చిత్రం తమిళం - తెలుగు వెర్షన్లకు కూడా గొప్ప డిమాండ్ నెల‌కొంది. నిజానికి జ‌వాన్ హిందీ వెర్ష‌న్ ద‌క్షిణాది మార్కెట్ల నుండి గరిష్ట ఆసక్తిని క‌లిగి ఉంద‌ని ట్రేడ్ చెబుతోంది. హైదరాబాద్, కోల్‌కతా, బెంగుళూరు, చెన్నై వంటి న‌గ‌రాల్లో గొప్ప డిమాండ్ నెల‌కొంది. రాఠీ ఇంకా మాట్లాడుతూ ``జ‌వాన్ ప్రపంచవ్యాప్తంగా నెట్ వ‌సూళ్ల ప‌రంగా.. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రూ. 400 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా నెట్. భార‌త‌దేశం నుంచే ఈ చిత్రం 300కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నా``మ‌ని తెలిపారు.

పఠాన్ బాక్సాఫీస్‌ను బీట్ చేస్తుందా?

ఇండియా బాక్సాఫీస్ వద్ద `పఠాన్` రూ.543.05 కోట్లు రాబట్టగా, జవాన్ ఓపెనింగ్ వీకెండ్ లోనే రూ.400 కోట్లను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేర‌కు జ‌వాన్ గణాంకాలను అక్ష‌య్ రాఠీ విశ్లేషించారు. నిజాయితీగా చెప్పాలంటే ప‌ఠాన్ కంటే జ‌వాన్ కి ఒక పెద్ద ప్ల‌స్ ఏమిటంటే...ఈ చిత్రం చాలా ఎక్కువ మాసీగా ఉంది. ప‌ఠాన్ నిజానికి అర్బన్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్. కానీ జ‌వాన్ హార్డ్ కోర్ మాస్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటి. జవాన్ కి రెండవ అంతర్గత ప్రయోజనం ఏమిటంటే..పఠాన్‌ తమిళ కలెక్షన్స్‌ కంటే జ‌వాన్ కి చాలా ఎక్కువ క‌లెక్ష‌న్స్ ద‌క్క‌నున్నాయి. పఠాన్ కి రూ. 2 కోట్లు ఓపెనింగు రాగా..జవాన్‌ 1వ రోజు తమిళనాడులోనే రూ. 8 నుంచి 9 కోట్లు రాబడుతోంద‌ని తెలిపారు. షారుఖ్ ఖాన్‌తో పాటు సూప‌ర్ స్టార్ నయనతార ప్ర‌భావం కూడా ద‌క్షిణాదిన అద‌న‌పు బ‌లం. తనకంటూ ఫాలోయింగ్ ఉన్న సంగీత దర్శకుడిగా అనిరుధ్ బాణీలు క్రేజ్ ని పెంచాయి. విజయ్ సేతుపతి కీల‌క పాత్ర కూడా అస్సెట్. ఇవన్నీ కలిపి దాదాపు తమిళనాడుకి స్థానిక చిత్రంలా ఉంటుంది. త‌మిళులు పెద్ద సంఖ్యలో థియేటర్ల కు వస్తారు. ఒక్క తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 50 కోట్లు వస్తాయని అంచ‌నా వేస్తున్నామ‌ని తెలిపారు. ఇక జ‌వాన్ టార్గెట్ ని విశ్లేషిస్తే తొలి 3రోజుల్లో 400 కోట్లు.. ఫుల్ ర‌న్‌లో 1000 కోట్లు వ‌సూలు చేయాల‌న్న‌ది గేమ్ ప్లాన్ అని తెలిసింది.

అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో షారుక్ ఖాన్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ రమణగిరివాసన్‌తో కలిసి అట్లీ స్క్రిప్ట్‌ రాశారు. షారూఖ్ ఖాన్ - నయనతార స‌హా విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగి బాబు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.