ఐపీఎల్ కూడా.. షారుఖ్ లక్కు మామూలుగా లేదు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సీరియల్ లో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి 1992లో దివానా మూవీతో బాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టాడు.
By: Tupaki Desk | 27 May 2024 4:04 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సీరియల్ లో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి 1992లో దివానా మూవీతో బాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ట్ హీరోగా ఎదిగాడు. బాలీవుడ్ బాద్ షా అనే స్థాయికి తన బ్రాండ్ ని షారుఖ్ ఖాన్ పెంచుకున్నాడు. అయితే 2011లో రావన్ తో షారుఖ్ ఖాన్ కి డిజాస్టర్ ఆ తరువాత నుంచి 2018 వరకు సినిమాలు చేస్తూనే ఉన్న ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు.
ఒకటి, రెండు సినిమాలు తప్ప బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మూవీస్ లేవు. 2018లో జీరో మూవీ అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని షారుఖ్ ఖాన్ ఇమేజ్ ని దెబ్బతీసింది. ఆ తరువాత ఐదేళ్లు గ్యాప్ తీసుకొని గత ఏడాది పఠాన్ మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని షారుఖ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వెంటనే గత ఏడాది జవాన్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా పఠాన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది. నెక్స్ట్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో చేసిన డంకీ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అలా గత ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీకి షారుఖ్ ఖాన్ కారణంగా 2500+ కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఆ సినిమాలతో బాలీవుడ్ సినిమా మార్కెట్ కూడా గాడిలో పడింది.
షారుఖ్ ఖాన్ లక్ ఈ ఏడాది కూడా ఇంకా కొనసాగుతూనే ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం 2024లో ఐపీఎల్ విజేతగా షారుఖ్ ఖాన్ జట్టు కోల్ కత్తా నైట్ రైడర్స్ నిలిచింది. మంచి ఊపు మీద ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ లో ప్లే ఆఫ్ తో పాటు ఫైనల్ లో కూడా చిత్తుగా ఓడించి ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ సీజన్స్ లలో మూడో సారి కోల్ కత్తా నైట్ రైడర్స్ విజేతగా అవతరించింది.
గత ఏడాది వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం. ఈ ఏడాది ఆరంభంలో ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడం. ఇవన్నీ చూస్తుంటే షారుఖ్ ఖాన్ సుడి చాలా గట్టిగా తిరుగుతుందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే షారుఖ్ ఖాన్ ప్రతి సక్సెస్ లో అతని ఎఫర్ట్, కష్టం కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్ నైట్ రైడర్స్ ఓనర్ గా ఆటగాళ్లకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫెసిలిటీస్ కల్పించాడు. ఓడినప్పుడు మద్దతుగా నిలబడ్డాడు. ఈ కారణాల వలన ఈ రోజు ఆ టీమ్ విజేతగా నిలిచిందని అభిమానులు అంటున్నారు.