కుమార్తె కోసం రికార్డుకెక్కిన హీరో!
సుహానాని తొలి సినిమాతోనే పెద్ద స్టార్ ని చేయాలన్న ఆలోచనతో ఖాన్ బాయ్ రంగంలోకి దిగాడు.
By: Tupaki Desk | 22 April 2024 6:49 AM GMTబాద్ షా షారుక్ ఖాన్ వారుసురాలు సుహానాఖాన్ బాలీవుడ్ ఎంట్రీ షు రూ అయిన సంగతి తెలిసిందే . అమ్మడు `కింగ్` అనే సినిమాతో లాంచ్ అవుతుంది. సుజోయ్ ఘోష్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్ అనుకున్నప్పటికీ ఇప్పుడు కుమార్తెకి గురువు అవతారం ఎత్తుతున్నాడు. తన స్టార్ డమ్ ని సైతం కుమార్తె కోసం పక్కనబెట్టి పనిచేస్తున్నాడు. సుహానాని తొలి సినిమాతోనే పెద్ద స్టార్ ని చేయాలన్న ఆలోచనతో ఖాన్ బాయ్ రంగంలోకి దిగాడు.
కింగ్ ఖాన్ ఇమేజ్ ని అంతకంతకు ఆ పాత్ర రెట్టింపు చేసేలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంతంటే? 200 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నట్ల బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం సాగుతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ది బెస్ట్ టీమ్ అంతా సినిమాకి పనిచేసేలా చూడాలని సుజోయ్ ఆదేశించాడుట. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో చరిత్ర అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారసులు కోసం ఇంతగా ఏ తండ్రి ఖర్చు చేయలేదు.
కుమారులు హీరోగా నటించిన సినిమాలకి కూడా ఏ తండ్రి ఇంత ఖర్చు పెట్టలేదు. ఇంతవరకూ ఎంతో మంది స్టార్ కిడ్స్ బాలీవుడ్ కి పరిచయమయ్యారు. అలాగే ఇతర పరిశ్రమల నుంచి కూడా చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఏ తండ్రి ఈ రేంజ్ లో వారతస్వంతో కోసం కేటాయించలేదు. అలాంటిది సుహానా కోసం షారుక్ ఏకంగా 200 కోట్లు పైనే పెడుతున్నారంటే? అది చరిత్రే అవుతుంది. కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎలాగూ మ్యాకప్ వేసుకునే అవకాశం లేదు. తాను హీరోగా కంటే దర్శకుడిగానే ఉంటానని చెప్పేసాడు.
ఆ రకమైన ప్రయత్నాల్లో ఇప్పటికే బిజీ అయ్యాడు. కుమారుడికి కావాల్సిన అన్ని రకాల బ్యాకప్ షారుక్ అందిస్తున్నాడు. ఇప్పుడు కుమార్తె వంతు రావడంతో 200 కోట్లు పెట్టడమే కాకుండా తన స్టార్ డమ్ ని సైతం పక్కనబెట్టి గురువు అవతారం ఎత్తడం విశేషం. ఇక షారుక్ ఖాన్ గతేడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న సంగతి తెలిసిందే. పఠాన్..జవాన్ తో వరుస విజయాలతో పుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన పనుల్లో ఉన్నాడు.