Begin typing your search above and press return to search.

రొమాన్స్ లో చీప్ గా ఉండొద్దు.. నెటిజన్‌ కి షారుఖ్‌ రిప్లై

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:15 AM GMT
రొమాన్స్ లో చీప్ గా ఉండొద్దు.. నెటిజన్‌ కి షారుఖ్‌ రిప్లై
X

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వారితో సరదా సంభాషణ సాగిస్తూ ఉన్న నేపథ్యంలో జవాన్ సినిమా కు మంచి పబ్లిసిటీ దక్కింది.

పఠాన్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో జవాన్ సినిమా పై ఆకాశాన్ని తాకే విధంగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా అట్లీ ఈ సినిమాను రూపొందించి ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా షారుఖ్‌ ఖాన్ కి ఆసక్తికర పరిస్థితి సోషల్‌ మీడియా ద్వారా ఎదురు అవ్వడం, అందుకు ఆయన సమాధానం వైరల్‌ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. షారుఖ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తూ ఉండగా ఒక అభిమాని తన లవర్ కోసం ఫ్రీ గా టికెట్‌ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించాడు. అందుకు షారుఖ్‌ స్పందించాడు. మీరు టికెట్‌ ను ఉచితంగా కావాలని కోరుకోకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఉచితంగా ప్రేమ లభిస్తుంది కానీ సినిమా టికెట్‌ లభించదు. కనుక మీరు టికెట్‌ ను కొనుగోలు చేసి సినిమాను చూడండి, మీ ప్రేయసికి చూపించండి. ప్రేమ విషయంలో మరీ ఇంత చీప్ గా ఉండొద్దు. రొమాన్స్ లో చీప్‌ గా ఉండటం మంచిది కాదని కూడా సోషల్‌ మీడియా ద్వారా షారుఖ్‌ ఖాన్ ఇచ్చిన రిప్లై కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ఈ సినిమా పై షారుఖ్‌ ఖాన్‌ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యం లో సౌత్ లో కూడా డైరెక్ట్‌ సినిమాల మాదిరిగానే విడుదల అవ్వబోతుంది. పఠాన్ కి ఏమాత్రం తగ్గకుండా అట్లీ రూపొందించిన జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్ల సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.