Begin typing your search above and press return to search.

గాయని వేదిక‌పై డ్యాన్స్ చేస్తుంటే అభిమాని పాడు ప‌ని!

కానీ ఇప్పుడు ఆ వైర‌ల్ క్లిప్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇది అవ‌మాన‌కరం! అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:56 AM GMT
గాయని వేదిక‌పై డ్యాన్స్ చేస్తుంటే అభిమాని పాడు ప‌ని!
X

ప్ర‌ముఖ గాయ‌ని వేదిక‌పై మైమ‌రిచి డ్యాన్సులు చేస్తోంది. అయితే వేదిక దిగువ‌న ఉన్న ఒక అభిమాని ఆమె దుస్తుల కింద నుంచి అస‌భ్య‌క‌రంగా కెమెరాతో చిత్రీక‌రిస్తూ క‌నిపించాడు. దానిని గ‌మ‌నించిన స‌ద‌రు గాయ‌ని షాక్ కి గురైంది. అత‌డి సిగ్గు మాలిన ప‌నికి అవ‌మానంతో అక్క‌డి నుంచి నిష్కృమించింది. కానీ ఇప్పుడు ఆ వైర‌ల్ క్లిప్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇది అవ‌మాన‌కరం! అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

పాపుల‌ర్ గాయ‌ని మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ పాప్ గాయ‌ని ష‌కీరా. మయామి నైట్‌క్లబ్‌లో తన కొత్త పాట సోల్టెరాకు డ్యాన్స్ చేస్తూ ఊహించని రీతిలో అక్క‌డి నుంచి ఆమె నిష్క్రమించింది. కొలంబియన్ గాయని ష‌కీరా వేదికపై డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె దుస్తుల కింద కెమెరాతో రికార్డ్ చేస్తున్న అప‌రిచిత‌ వ్యక్తి వెకిలిగి క‌నిపించాడు. ఇప్పుడు షకీరా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. చాలా మంది అభిమానులు అత‌డిని గగుర్పాటుకు గురి చేసే పాడు మనిషి! అంటూ తిట్టారు. ఇది సిగ్గుపడే ప‌ని! అంటూ నిందలు వేస్తున్నారు.

మ‌రింత‌గా వివ‌రాల్లోకి వెళితే.. షకీరా తన పాట సోల్టెరాను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని నైట్‌క్లబ్ LIV మయామిలో వేదికపై ఉన్న‌ప్పుడు ఆమె సీక్విన్ డ్రెస్ ధరించి ఉంది. ఆ చిన్న వేదికపై డ్యాన్స్ చేసింది. అయితే త‌న వీడియోని రికార్డ్ చేసిన వ్య‌క్తిని గ‌మ‌నించింది. ఈ క్లిప్ చూడ‌టానికి చాలా అస‌భ్యంగా క‌నిపిస్తోంది. అయితే అంత గ‌డ‌బిడ‌లోను షకీరా లెన్స్ వెనుక ఉన్న వ్యక్తికి తన ముఖాన్ని చిత్రించమని సైగ చేసింది. ఆమె దుస్తులను లో యాంగిల్ నుండి చిత్రీకరించ‌డాన్ని ఆక్షేపించింది. ష‌కీరా వేదికపై నుండి అకస్మాత్తుగా నడవడానికి ముందు నృత్యం చేస్తూనే అత‌డికి వార్నింగ్ ఇచ్చింది. ఆమె వేదికపై నుంచి బయటకు రాగానే వీఐపీ ఏరియాలో సెక్యూరిటీ, అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు.

ఈ వీడియోపై X వినియోగదారు స్పందిస్తూ -ఇది చాలా అవమానకరమైన చర్య. ఈ వ్యక్తులలో మానవత్వం మిగిలి ఉందా? అని విమ‌ర్శించారు. షకీరా లైంగిక వేధింపులకు గురికాకుండా తన సొంత‌ పాటలో కూడా నృత్యం చేయలేదు అని ఒక‌రు స్పందించారు. మంచిని నాశనం చేస్తారు! అని కూడా వ్యాఖ్యానించారు. ఇది నిజంగా నిరుత్సాహపరిచే ప్రవర్తన. కళాకారులు వేదికపైన‌ వెలుపల గౌరవం, గోప్యతకు అర్హులు. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందుబాటులో ఉంచ‌డం చాలా కీలకం.. అని రాసారు.

ఈ సంవత్సరం మార్చిలో షకీరా తన 12వ స్టూడియో ఆల్బమ్ `లాస్ ముజెరెస్ యా నో లోరన్` (విమెన్ డోంట్ క్రై ఎనీమోర్) విడుదలైంది. గ‌త‌ ఏడు సంవత్సరాలలో ఇది మొదటి ఆల్బమ్.. షకీరా మాజీ స్పానిష్ ఫుట్‌బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ జూన్ 2022లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమె వెంటనే తన కుమారులతో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది. షకీరా- గెరార్డ్ 2022లో విడిపోయే వరకు దాదాపు 11 సంవత్సరాలు డేటింగ్ చేశారు.